»   »  వర్మ ‘ఐస్‌క్రీమ్’పై ఓ రూమర్

వర్మ ‘ఐస్‌క్రీమ్’పై ఓ రూమర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తనను తాను కాపీ కొట్టుకోవటంలో వర్మ దిట్ట. ఒకే సినిమాను అటు మార్చి ఇటు మార్చి ఆయన తీస్తూంటారు. గాడ్ ఫాదర్ చిత్రానికే ఆయన అనేక వెర్షన్ వేసారు. అయితే ఇప్పుడు ఆయన రంగీళా ఊర్మిళతో చేసిన కౌన్ చిత్రాన్ని కొంచెం అటూ ఇటూ మార్చి ఐస్ క్రీమ్ గా అందిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ట్రైలర్స్ చూసిన వారు సైతం అదే సందేహిస్తున్నారు. కౌన్ లో మనోజ్ బాజపేయి పాత్రను ఇక్కడ నవదీప్ చేసాడని, ఊర్మిళ పాత్రను తేజస్వి చేసిందని అంటున్నారు. అయితే ఇది నిజమా కాదా అనేది తెలియాలంటే మాత్రం చిత్రం చూడాల్సిందే.

విభిన్న కథాంశాలతోనే కాకుండా డిఫరెంట్ టైటిల్స్‌తో సినిమాలు తీసే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం 'ఐస్‌క్రీమ్'. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవదీప్ హీరో. తేజస్వి హీరోయిన్. సైలెంట్‌గా రెండు నెలల క్రితం ఈ చిత్రాన్ని ప్రారంభించిన వర్మ నాన్‌స్టాప్ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తి చేసి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో నిమగ్నమయ్యారు. వచ్చే నెల 4న సినిమా విడుదల చేయడానికి నిర్మాత రామసత్యనారాయణ సన్నాహాలు చేస్తున్నారు.

టైటిల్‌కు తగ్గట్లుగానే వర్మ ఇప్పటివరకూ తీసిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. 'ఐస్‌క్రీమ్' చిత్రానికున్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. తన మొదటి సినిమా 'శివ'తో స్టడీకామ్ కెమెరాను పరిచయం చేసిన రాము తాజాగా ఈ చిత్రంలో ఫ్లోకామ్ అనే కెమెరాను ఉపయోగించారు. దీనిని ఆసియాలోనే తొలిసారిగా ఉపయోగించిన దర్శకుడు వర్మ అని చెప్పాలి. ఫ్లోకామ్‌తో చిత్రీకరించిన సన్నివేశాలను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందుతారని యూనిట్ సభ్యులు చెప్పారు.

Rgv's Ice Cream inspired From Kaun?

దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ- సినిమా కోసం ఎంత మంచి టెక్నాలజీ ఉపయోగించినా, ఆ చిత్రంలో కథ, కథనం కొత్తగా ఉంటేనే ప్రేక్షకులు విజయాన్ని అందిస్తారన్నారు. ఈ చిత్రం ద్వారా తాను 'ఫ్లోకేమ్' అనే టెక్నాలజీని ఇండియన్ ఫిలిం పరిశ్రమకు పరిచయం చేస్తున్నానని, ఇప్పటివరకు తాను రూపొందించిన చిత్రాల్లో 'ఐస్‌క్రీమ్' డిఫరెంట్‌గా ఉంటుందని తెలిపారు. ఐస్‌క్రీమ్ పేరు ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రాధాన్యత ఉన్నది కనుక, ఆ పేరునే ఖరారుచేశామని అన్నా రు.

రామ్‌గోపాల్‌వర్మ లాంటి దర్శకుడితో సినిమా తీయడం చాలా సంతోషంగా భావిస్తున్నానని, ఈ చిత్రం సంచలన విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. ఓ గొప్ప దర్శకుడి చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని, ఆయన నటన ఎలా చేయాలో చెప్పకపోయినా సన్నివేశాలకు తగ్గట్లుగా ఎలా వుండాలో చెబుతారని నవదీప్ తెలిపారు.

English summary
Ram Gopal Varma film, 'Ice Cream', which has been in progress for two months, has completed. The film is in post production work now and it is being planned to be released on July 4th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu