»   »  మైనస్, మైనస్ కలిసి ప్లస్ అవుతుందా?

మైనస్, మైనస్ కలిసి ప్లస్ అవుతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ పట్టపగలు చిత్రం చేస్తున్నారు అనే సంగతి తెలిసిందే. పూర్తి హర్రర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్వాతి దీక్షిత్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం మొదటి ప్రకటించిన తేదీకి విడుదల కాలేదు. దానికి కారణం వర్మ పూర్తిగా అవుట్ పుట్ తో సంతృప్తి చెందకపోవటం అని చెప్తున్నారు. అంతేకాక చిత్రానికి కూడా బిజినెస్ కాకపోవటం కూడా మరో కారణం. అటు ఫ్లాపుల్లో ఉన్న రాజశేఖర్, ఇటు వర్మ కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్టు ఇద్దరికి ప్లస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. అగస్టు 12న ఈ చిత్రం విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇక ఐస్ క్రీమ్ తో హడావిడి సృష్టించిన వర్మ ఈ వేడిలోనే ఈ చిత్రాన్ని బయిటకు పంపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దాంతో హడావిడిగా వర్మ ఈ చిత్రంలో క్లైమాక్స్ ని రీ షూట్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. మొదట అనుకుని షూట్ చేసిన క్లైమాక్స్ పేలవంగా ఉందని ఈ చిత్రం ఎడిట్ వెర్షన్ చూసి ఫీలయ్యారని, దాంతో ఈ రీషూట్ పెట్టుకున్నాడని చెప్తున్నారు. ఈ చిత్రం కూడా హర్రర్ చిత్రం కావటం, రాజశేఖర్ తొలిసారిగా ఇలాంటి పాత్ర చేయటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడే అవకాసం ఉంది.

హారర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పెళ్లికావాల్సిన కూతురున్న తండ్రిగా రాజశేఖర్ నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం మేకప్ లేకుండా, రియల్ గెటప్‌లోనే ఆయన నటిస్తున్నారు. 'బ్రేకప్'లో రణధీర్‌కి జోడీగా నటించిన స్వాతి దీక్షిత్ ఇందులో రాజశేఖర్ కూతురి పాత్రను పోషిస్తోంది.

RGV's Patta Pagalu in re-shoot

రాజశేఖర్‌ మాట్లాడుతూ ''ప్రతీ చిత్రంలోనూ ఒక వైవిధ్యమైన పాత్రని పోషిస్తున్నా. వర్మతో 'పట్టపగలు' చిత్రం చేయడం తృప్తినిచ్చింది. మామూలుగా ఒక హార్రర్‌ సినిమా చేయాలనుకుంటే నేను నటించడం వల్ల సెంటిమెంట్‌ కూడా బాగా పండిందని వర్మ అనడం మరువలేను. ఒక రకంగా నేను వర్మ ఫోర్స్ చేసి స్క్రిప్టుని మార్చేశాను. నా 'గోరింటాకు' చిత్రంలాగే మహిళలకు ఈ సినిమా చేరువవుతుందనే నమ్మకముంది అన్నారు.

దాదాపు 15 రోజులు రెగ్యులర్ షూటింగ్ లో ఈ చిత్రం ఫినిష్ చేసాడని,త్వరలోనే విడుదల చేస్తున్నాడని వినికిడి. ఈ మేరకు ఎడిటింగ్ వర్క్ సైతం పూర్తైందని అంటున్నారు. రాజ శేఖర్ సినిమాలు ఈ మధ్యన రావటం లేదు. వచ్చినా ఆడటం లేదు. చాలా స్లంప్ లో ఉన్న రాజశేఖర్ చేస్తున్న చిత్రం కావటంతో దీనిపై క్రేజ్ వచ్చే అవకాసం ఉందంటున్నారు. ఈ చిత్రానికి రాజశేఖరే నిర్మాత కావటం విశేషం.

ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి వరస సినిమాలు ప్రారంభించిన వర్మ... మొన్నీ మధ్య రౌడీ, ఇప్పుడు ఐస్ క్రీమ్ అంటూ ముందుకు వచ్చారు. మంచు కుటుంబ ప్యాకేజి చిత్రంగా వచ్చిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. మంచు విష్ణు ..మీడియా ముందుకు వచ్చి..మా సినిమాకు బాగా డబ్బులొచ్చాయి అని చెప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత ఐస్ క్రీమ్ సైతం అదే పరిస్ధితి ఎదుర్కొంది. అప్పటికీ రివ్యూ రైటర్ పై విమర్శలతో ఈ చిత్రానికి పబ్లిసిటీ తేవాలని ప్రయత్నం చేసారు వర్మ.

English summary
Ram Gopal Varma’s directional venture ‘Patta Pagalu’ starring Rajasekhar is getting ready to hit the screens on August, 12th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu