»   » వర్మ మాటలు నమ్మలేదా?... సినిమాకు నో బిజినెస్

వర్మ మాటలు నమ్మలేదా?... సినిమాకు నో బిజినెస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తన సినిమాని మార్కెటింగ్ చేసుకోవటానికి వర్మ వేసే ఎత్తులు ప్రేక్షకులకే కాదు ట్రేడ్ వర్గాలకు సైతం పూర్తిగా అవగతమయ్యాయి. దాంతో ఆయన రీసెంట్ గా తన చిత్రాల ప్రమోషన్ కోసం మాట్లాడే మాటలని ఎవరూ సీరియస్ గా తీసుకోవటం లేదు.. దాంతో ఆ మాటలతోనే సినిమాని అమ్మేయ్యాలన్న ఆయన ఆలోచనలు సైతం ఫలించటం లేదు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


తాజాగా నిజ జీవితంలో తన వివాహం ఎందుకు విఫలమైందో కారణాలు తన కొత్త చిత్రం ‘365 డేస్' కథలో కొన్ని అంశాలు ఉంటాయని పదే పదే మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. దాంతో ఆ విషయం ఏమిటా అని తెలుసుకోవటానికి ఎగబడి తన చిత్రం బిజినెస్ అవుతుందని భావించినట్లు సమాచారం. అయితే ఈ కొత్త స్ట్రాటజీ పెద్దగా ఫలించినట్లు కనపడటంలేదు. దాంతో సినిమాని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దానికి తోడు వరసగా ఆయన సినిమాలన్నీ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని చూడటంకూడా బిజినెస్ కు దెబ్బ తీస్తోంది.


RGV’s romantic film 365 Days postponed

కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాని మే 15న రిలీజ్ చేయనున్నట్లు రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఒక వారం వాయిదా వేసారు. అనగా మే 22న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి నిర్ణయించుకున్నారు. నిఖిత శ్రీ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేష్ విలక్షణ - రామ్ గోపాల్ వర్మ కలిసి ఈ సినిమాని నిర్మించారు.


నందు,అనైక సోతి జంటగా నటించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని క్లీన్ ‘యు' సర్టిఫికేట్ తెచ్చుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తోంది.


ఇప్పటి వరకూ వయోలెంట్ సినిమాలు, హర్రర్ సినిమాలు, యాక్షన్ ధ్రిల్లర్ అందించిన రామ్ గోపాల్ వర్మ తన కెరీర్లో మొదటి సారి పూర్తి రొమాంటిక్ లవ్ స్టొరీగా చేసిన సినిమా ‘365 డేస్'. నేటి తరం ప్రేమలు ఎలా ఉన్నాయి, ప్రేమకు ముందు ఒక జంట ఎలా ఉంటోంది - పెళ్లి తర్వాత అదే ప్రేమ జంట ఎలా ఉంటోంది అనే పాయింట్ ని బేస్ చేసుకొని చేసిన సినిమానే ‘365 డేస్'.


చిత్ర నిర్మాత డి. వెంకటేష్‌ మాట్లాడుతూ '' '365 డేస్‌'లో నాకు విపరీతంగా నచ్చిన అంశం ఏంటంటే వర్మ తన 25 ఏళ్ల కెరియర్‌లో 100% పూర్తి లవ్‌, రొమాంటిక్‌ చిత్రం చేయడం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రం చూసినవాళ్లు ఈ చిత్రకథ ప్రతి ప్రేమజంటకి ప్రతి పెళ్ళైనజంటకి కూడా కనెక్ట్‌ అవుతుందని చెప్తున్నారు.


365 డేస్‌ ఒక్క రామ్‌ గోపాల్‌ వర్మ పెళ్లి కధే కాదు, ప్రతి ఒక్కరి ప్రేమ కథ. ప్రతి ఒక్కరి పెళ్లి కథ. ఈ అందమైన పెళ్లి కథకు ప్రేక్షకులందరూ కదలి రావాలని రామ్‌ గోపాల్‌ వర్మ పిలుపు నివ్వబోతున్నారు.' అన్నారు. 

English summary
Ram Gopal Varma is making a rebound to the romantic type with an up coming film ‘365 Days’. According to the most recent reports, this current film’s release has been postponed to May 22nd.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu