Don't Miss!
- News
vastu tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా? అరిష్టం.. ఎందుకంటే!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
సినీ రివ్యూ రేటింగ్ లపై రామ్ గోపాల్ వర్మ ఘాటు సెటైర్
రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం "కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు" లో వెబ్ మీడియాపై సెటైర్స్ వేయనున్నారు. ముఖ్యంగా వెబ్ సైట్స్ లో వచ్చే రివ్యూలపై ఆయన విరుచుకుపడనున్నారు. రాజ రవీంధ్ర ఈ చిత్రంలో నో బ్రెయిన్ డాట్ కాం సైట్ ని నడుపుతూంటాడు. అతను నిర్మాతల నుంచి రివ్యూ రాయటానికి డబ్బు డిమాండ్ చేస్తూంటాడు. అతను ఎప్పుడూ చెప్పే డైలాగు...రేటు నువ్వు చెప్పు..రేటింగ్ నేను వేస్తాను అని. అలాగే ఆ పాత్ర పేరు ఈవీ. ఆయన ఐడియల్ బ్రెయిన్ జీవీ ని టార్గెట్ చేస్తున్నారు. నో బ్రెయిన్ డాట్ కామ్ అంటే ఐడియల్ బ్రెయిన్ డాట్ కామ్ అని అర్ధం. ఇక తన చిత్రాలుపై వచ్చిన నెగిటివ్ రివ్యూలకు వర్మ ఈ విధంగా పగ తీర్చుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే మరి వెబ్ మీడియా గురించి తెలియని సామాన్య ప్రేక్షకుడులు వీటిని ఎలా అర్ధం చేసుకుని రిసీవ్ చేసుకుంటారనేది ఇండస్ట్రీలో సీనియర్స్ ప్రశ్న. తమ వ్యక్తిగత కక్షలకు సినిమాను తీయటం ఎంతవరకూ సబబు అనేది అందరి ఆలోచన. ఇంతకుముందు కూడా రాము శిష్యుడు దర్శకుడు పూరి జగన్నాధ్ తన నేనింతే చిత్రంలో వెబ్ మీడియాపై సెటైర్స్ వేసి తన ఆక్రోసం వెళ్ళగక్కిన సంగతి తెలిసిందే.