»   » నమ్మించాలంటే వర్మ అలా చెయ్యాల్సిందే...తప్పదు

నమ్మించాలంటే వర్మ అలా చెయ్యాల్సిందే...తప్పదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వరస ప్లాపులతో తనపైన ఉండే నమ్మకాన్ని మెల్లిగా పోగొట్టుకోవటం మొదలెట్టారు వర్మ. ఒకప్పుడు వర్మ సినిమా అంటే హీరో,హీరోయిన్స్ తో సంభంధం లేకుండా ధియోటర్స్ హౌస్ ఫుల్ అయ్యేవి. ఇప్పుడా పరిస్ధితి లేదు. మీడియాకూడా పెద్దగా ఆయనకు ప్రయారిటీ ఇవ్వటం మానేసింది. ఈ నేపధ్యంలో ఆయన తన కొత్త చిత్రం ఐస్ క్రీమ్ ప్రమోషన్ కోసం కొత్త స్కీమ్ వేసారని తెలుస్తోంది. మీడియా వారికి ప్రెస్ మీట్ పెట్టి చిత్రంలోని కొన్ని సీన్స్ ని ప్రదర్శించబోతున్నారు. దాంతో ఇంప్రెస్ అయిన మీడియావారు తన సినిమాను ప్రమోట్ చేస్తారని భావిస్తున్నారు.

తన మొదటి చిత్రం 'శివ'తో 'స్టడీకామ్' అనే పరికరాన్ని పరిశ్రమకు పరిచయం చేసిన రామ్ గోపాల్ వర్మ....'ఐస్ క్రీమ్' చిత్రంతో 'ఫ్లోకామ్' అనే ఒక సరికొత్త పరికరాన్ని చిత్ర పరిశ్రమకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. ఈ 'ఫ్లోకామ్' అనే టెక్నికల్ పరికరాన్ని మొత్తం ఆసియాలోనే మొట్ట మొదటి సారిగా 'ఐస్ క్రీమ్' చిత్రం కోసం ఉపయోగించడం విశేషం.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'ఐస్ క్రీం' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది. టైటిల్ చూసి ఇదేదో వర్మ రొటీన్‌గా తీసే సినిమాలకు భిన్నంగా ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే తాజాగా ట్రైలర్ విడుదలైన తర్వాత వర్మ మరోసారి ప్రేక్షకులను ఈ చిత్రం ద్వారా భయపెడతాడని స్పష్టం అవుతోంది.

RGV to screen few scenes from Ice Cream

'ఐస్ క్రీమ్' చిత్రాన్ని భీమవరం టాకీస్ బేనర్లో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత 2 నెలలుగా ఏకబిగిన జరిగిన షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జులై 4న విడుదల చేయడానికి వర్మ సన్నాహాలు చేసుకుంటున్నారు.

చాలా మందికి అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలైందో కూడా తెలియదు. దానికి కారణం ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించక పోవడమే. అసలు ఇలాంటి చేయడం వర్మకు ఇష్టం ఉండదట. సినిమా మొత్తం పూర్తయి..ఒక ట్రైలర్ గానీ, లేదా టీజర్ గానీ చేతికి వచ్చాకే సదరు సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ ఎనౌన్స్ చేస్తాడు. ఆ కోవలోనే 'ఐస్ క్రీమ్' టీజర్ రిలీజ్ చేసేందుకు వర్మ రెడీ అవుతున్నాడు. 'ఐస్ క్రీమ్' టైటిల్ చూస్తేనే ఈ చిత్రం వర్మ గత చిత్రాల కంటే భిన్నంగా ఉంటుందని స్పష్టమవుతోంది.

English summary
RGV will be screening few special scenes of Ice cream shot using this camera after a press meet tomorrow.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu