»   » సాయి కొర్రపాటి తరుపున రాజమౌళి వెళ్లినా..... నో చెప్పిన రోబో 2.0 నిర్మాత?

సాయి కొర్రపాటి తరుపున రాజమౌళి వెళ్లినా..... నో చెప్పిన రోబో 2.0 నిర్మాత?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Sai Korrapati Say No To Rajamouli

  'బాహుబలి' తర్వాత దాన్ని మించిన ప్రాజెక్టు ఏదైనా వస్తుందా? అంటే అది శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న 'రోబో 2.0'. దాదాపు రూ. 400 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఎంతో గ్రాండ్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

  ఈ చిత్రాన్ని తమిళ సినీ నిర్మాణ సంస్థ 'లైకా ప్రొడక్షన్స్' వారు నిర్మిస్తున్నారు. తెలుగు మూవీ 'ఖైదీ నెం 150' సినిమాలో కూడా వీరి భాగస్వామ్యం ఉంది. లైకా ప్రొడక్షన్ అధినేత ఎ శుభకరన్, దర్శకుడు రాజమౌళి మధ్య ఇటీవల 'రోబో 2.0' విషయంలో డిస్క్రషన్స్ జరిగినట్లు సమాచారం.

  తెలుగు రైట్స్ కోసం సాయి కొర్రపాటి ప్రయత్నం

  తెలుగు రైట్స్ కోసం సాయి కొర్రపాటి ప్రయత్నం

  ‘రోబో 2.0' మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్ దక్కించుకోవడానికి రాజమౌళికి అత్యంత సన్నిహితుడైన నిర్మాత సాయి కొర్రపాటి ప్రయత్నించాడని, రూ. 60 కోట్లకు రైట్స్ ఇవ్వాలని శుభకరణ్ ను అడిగినట్లు సమాచారం.

  రాజమౌళిని తీసుకుని వెళ్లిన సాయి

  రాజమౌళిని తీసుకుని వెళ్లిన సాయి

  అయితే శుభకరన్ నుండి ఎలాంటి సమాధానం రాక పోవడంతో.... దర్శకుడు రాజమౌళిని తీసుకుని వెళ్లి రైట్స్ విషయంలో మాట్లాడించినట్లు సమాచారం. అయితే రూ. 80 కోట్లు కంటే తక్కువకు తెలుగు రైట్స్ అమ్మే ప్రసక్తే లేదని శుభకరణ్ తేల్చి చెప్పారట.

  రాజమౌళి వెళ్లడానికి కారణం

  రాజమౌళి వెళ్లడానికి కారణం

  సాయి కొర్రపాటితో పాటు రాజమౌళి వెళ్లడానికి కారణం.... ఇద్దరూ కలిసి ఈ సినిమా కొని ‘వారాహి చలన చిత్రం' బేనర్లో తెలుగులో రిలీజ్ చేయాలనుకున్నారు. వారు రైట్స్ తమకు ఇస్తే స్వయంగా రాజమౌళి రంగంలోకి దిగి ‘రోబో 2.0' చిత్రానికి ప్రచారం చేయాలని అనుకున్నారు.

  తక్కువ చేసి అడగటం నచ్చలేదు

  తక్కువ చేసి అడగటం నచ్చలేదు

  సినిమా నిర్మాణంలో ఉన్న లోటు పాట్ల విషయం తెలిసి కూడా రాజమౌళి తక్కువ చేసి అడగటం శుభకరణ్‌కు నచ్చలేదట. అందుకే రైట్స్ ఇవ్వను అని చెప్పారట. అయితే తెలుగులో ఆ సినిమాకు రూ. 60 కోట్ల కంటే ఎక్కువ పెట్టడం అంటే రిస్క్ చేయడమే అనే ఉద్దేశ్యంతో రాజమౌళి తన ప్రయత్నాన్ని విరమించుకున్నారట.

  సునీల్ నారంగ్

  సునీల్ నారంగ్

  తాజాగా ‘రోబో 2.0' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈ చిత్రాన్ని రూ. 81 కోట్లకు కొన్నారట.

  English summary
  Rajamouli's friend and producer Sai Korapati has put up an offer of Rs 60 crore for the Telugu dubbing rights of 'Robo 2.0' being made by Lyca Productions owned by A Subaskaran. Tamil production house sold the same for Rs 81 crore to exhibitor-distributor Sunil Narang who outwitted Sai Korapati, Chadalavada Srinivasa Rao, and others to bag the dubbing rights.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more