»   » 'రోబో' చిత్రం పేరడి బాలకృష్ణ తాజా చిత్రంలో

'రోబో' చిత్రం పేరడి బాలకృష్ణ తాజా చిత్రంలో

Posted By:
Subscribe to Filmibeat Telugu

అధ్బుతమైన ఓపినింగ్స్ తో విడుదలై అంతటా అదరకొడ్తున్న"రోబో" చిత్రంకి పేరడీ రాబోతోంది. అయితే ఆ పేరడి ఉండేది బాలకృష్ణ చిత్రంలో కావటం విశేషం. బాలకృష్ణ,దాసరి నారాయణరావు కాంబినేషన్ లో రూపొందుతున్న పరమ వీర చక్ర చిత్రంలో ఈ పేరడి ని పెడుతున్నారు. బ్రహ్మానందంపై ఈ పేరడీ ని క్రియేట్ చేస్తున్నారు. అలీ రోబో గానూ, సైంటిస్ట్ గా బ్రహ్మానందంను చేయనున్నారు. ఇక కులూమనాలీలో అక్టోబర్ 10 నుంచి ఈ చిత్రం షూటింగ్ జరుగుతంది. ఓ పాట, కొన్ని ఇంపార్టెంట్ సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఇక సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సినీ హీరోగానూ, ఆర్మీ మేజర్ గానూ దేశభక్తి పూరిత పాత్రలో కనిపించనున్నారు. ఇక బాలకృష్ణ సరసన అమీషా పటేల్, షీలా, నేహా ధూఫియాల ముగ్గరూ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం రిలీజ్ అవుతుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu