»   » వర్కవుట్ అయ్యిందా,జూ. ఎన్టీఆర్ గతంలో చేసిన నిర్మాతలకు కూడా పండగే

వర్కవుట్ అయ్యిందా,జూ. ఎన్టీఆర్ గతంలో చేసిన నిర్మాతలకు కూడా పండగే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, కాజల్‌ అగర్వాల్‌ జతగా నటించిన 'టెంపర్‌' బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని తమిళం, హిందీల్లో రీమేక్‌ చేయబోతున్నట్లు ఇదివరకు వార్తలు వెలువడ్డాయి. అయితే హిందీ రీమేక్‌ని దర్శకుడు రోహిత్‌ శెట్టి తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రణ్‌వీర్‌ సింగ్‌ ఎన్టీఆర్‌ పాత్రలో కన్పించనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

అయితే టెంపర్‌ విడుదలైన కొన్ని నెలలకే బాలీవుడ్‌ నిర్మాత, నటుడు సచిన్‌ జోషి ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ కొనుక్కున్నారు. రోహిత్‌ శెట్టి తెరకెక్కించే రీమేక్‌లో కాజల్‌ పాత్రలో ఎవరు నటించబోతున్నారు అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రం హిట్టైతే హిందీ పరిశ్రమ దృష్టి ఎన్టీఆర్ సినిమాలపై పడుతుంది.

ఇక వరస పెట్టి ఎన్టీఆర్ సినిమాలు రీమేక్ చేసే అవకాసం ఉంటుందని టాలీవుడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సినిమా ప్రారంభం అయితే ఆ సినిమా కథ ఏంటని ఎంక్వైరీ చేసి, అడ్వాన్స్ ఇచ్చే రోజులు వస్తాయని అంటున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ తో గతంలో హిట్ సినిమాలు తీసిన నిర్మాతలకు కూడా రీమేక్ రైట్స్ ఆఫర్స్ వస్తాయని చెప్పుకుంటున్నారు.

Rohit and Ranveer to join hands for the remake of Telugu film ‘Temper’?


టెంపర్ దర్శకుడు పూరి జగన్నాధ్ మాట్లాడుతూ..''బాలీవుడ్‌ నుంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ హిందీలో సినిమా వేగంగా పట్టాలెక్కడం కష్టం. ఓ ఆరేడు నెలలు ఉండాలి. అలా ఉంటే తెలుగు సినిమాలకి దూరం కావాల్సి వుంటుంది. అందుకే ఇక్కడే సినిమాలు చేస్తున్నా. అయితే ఆమధ్య అభిషేక్‌ బచ్చన్‌తో 'టెంపర్‌' చేద్దామనుకొన్నా. ఆయనకి కథ చెబితే ఎన్టీఆర్‌లా అంతటి భావోద్వేగాలు పండించలేను అన్నారు. దాంతో ఆగిపోయా.'' అన్నారు.

ప్రస్తుతం దర్శకుడు రోహిత్ శెట్టి ప్రస్తుతం గోల్ మాల్ 4 ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. రణవీర్ సింగ్ అయితే.. సంజయ్ లీలా భన్సాలీ చిత్రం పద్మావతిలో కీలక పాత్రతో ఆకట్టుకోబోతున్నాడు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో టెంపర్ రీమేక్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రణవీర్ సింగ్-రోహిత్ శెట్టి కాంబినేషన్ అనగానే.. బాలీవుడ్ లో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని అంటేశాయి. అదీ సక్సెస్ ఫుల్ రీమేక్ కావటంతో ఇక చెప్పేదేముంది.

English summary
Reports suggest that Rohit plans to make a Hindi remake of Telugu film 'Temper' starring Ranveer in the lead. 'Temper', a Telugu film directed by Puri Jagannadh stars NT Rama Rao Jr and Kajal Aggarwal in the lead. The story is about a corrupt police officer who falls in love with a girl who wants to change him for good.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu