»   » రోజా కూతురు అను మల్లిక తెరంగేట్రం, తమిళంలోనట?

రోజా కూతురు అను మల్లిక తెరంగేట్రం, తమిళంలోనట?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా కూతురు అను మల్లిక సినీరంగ ప్రవేశం చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. పలు హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రోజా చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయాల్లోనూ రాణిస్తోంది.

ఆయా టీవీ చానల్స్‌లో వచ్చే గేమ్, కామెడీ షోలలో కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. జబర్దస్త్‌లో కూడా ఆమె పాల్గొంటోంది. అయితే తాజాగా ఆమె తన కుమార్తె అన్షు మల్లికను వెండితెరకు పరిచయం చేస్తున్నట్టు తెలిసింది.

Roja/s daughter may enter film world

'అన్షు మల్లిక'ను తన వారసురాలిగా రోజా త్వరలోనే పరిచయం చేయాలని అనుకుంటున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.. ఈ క్రమంలోనే కుమార్తె తెరంగేట్రానికి రోజా చొరవ తీసుకుంటూ అందుకు తగినట్టుగా పలు సన్నాహాలు కూడా చేస్తుందని తెలిసింది.

ఓ తమిళ సినిమాలో బాలనటిగా అన్షును పరిచయం చేయనున్నారని, ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన పలు దర్శక నిర్మాతలు కూడా అన్షును తెలుగు తెరకు పరిచయం చేసేందుకు ఉత్సాహం చూపుతున్నట్టు సమాచారం.

English summary
It is said that Roja's daughter Anu Malliaka may enter film world soon.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu