»   » ముద్గుగుమ్మ తేజస్వినితో ప్రభు దేవా చెట్టాపట్టాల్?

ముద్గుగుమ్మ తేజస్వినితో ప్రభు దేవా చెట్టాపట్టాల్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ దర్శకుడు ప్రభు దేవా మరో తారతో సంబంధాల్లో చిక్కుకున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ మధ్య కేరళ నటి నయనతారతో ఆయన సంబంధం పెళ్లి దాకా వచ్చి బెడిసికొట్టింది. ప్రస్తుతం అతను కన్నడ నటి తేజిస్వినితో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఇటీవల ప్రభు దేవా ఇచ్చిన ఓ ప్రైవేట్ పార్టీలో ఇరువురు కలిసి దిగిన ఫొటోలు ఈ పుకార్లకు ఆజ్యం పోశాయి. ఈ ఫొటోలను స్వయంగా తేజస్విని సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే, వాటిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని తేజస్విని అంటోంది.

Romour: relation between Prabhu deva and tejaswni

ప్రభు, తాను మంచి మిత్రులమని, అప్పుడప్పుడు ఒకరికొకరం కాల్ చేసుకుంటామని, మెసేజ్‌లు షేర్ చేసుకుంటామని, అతను చెన్నైలో ఉన్నప్పుడు కలుసుకుంటామని ఆ ముద్దుగుమ్మ చెప్పేస్తోంది.

పని మీద తాను రెండు సార్లు వెళ్లినప్పుడు ప్రభు దేవా చెన్నైలో ఉన్నాడని, దాంతో అక్కడ అతను ఇచ్చిన పార్టీలకు తనను ఆహ్వానించాడని, ఆ ఫోటోనే తాను పోస్టు చేశానని, అది చూసి జనాలు పలు రకాలుగా ఊహించేసుకుంటున్నారని ఆమె అన్నది. అంతేకాదు, ప్రభు తనను బాగా ఎంకరేజ్ చేస్తున్నాడంతే నంటూ ముక్తాయింపు ఇచ్చేసింది.

English summary
It is said that relationship is developed between Prabhu Deva and Kannada actress Tejaswini.
Please Wait while comments are loading...