Just In
- 53 min ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్‌లో సినీ పరిశ్రమ!
- 58 min ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 1 hr ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 2 hrs ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- Automobiles
ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని కొత్త ఒకినవ స్కూటర్
- News
సుప్రీంకోర్టులో ఏపీ పంచాయతీ- సర్కారు అప్పీలు-ఎస్ఈసీ కేవియట్- తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
- Sports
'సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్ సందేశం పంపించారు.. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం'
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆమె కోసం రాజమౌళి ప్లాన్.. మొత్తానికి ఇలా సెట్ చేశాడా..?
రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మరో భారీ ప్రాజెక్ట్ 'RRR'. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్యాన్ ఇండియా మూవీ పలు భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా అప్‌డేట్స్, ఇతరత్రా వివరాల కోసం ప్రేక్షకలోకం ఎంతగానో ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా RRR హీరోయిన్ గురించిన ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. వివరాల్లోకి పోతే..

ఇద్దరు యంగ్ హీరోయిన్లు.. అందరి చూపు దానిపైనే
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి చూపు RRR సినిమాపైనే ఉంది. భారీ ప్రాజెక్టు కావడం, టాలీవుడ్ సహా బాలీవుడ్ తారలు ఈ సినిమాలో భాగం కావడం సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా బాలీవుడ్ భామ ఆలియా భట్ కన్ఫర్మ్ కాగా మరో హీరోయిన్‌గా హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ కన్ఫర్మ్ అయింది.

చెర్రీతో బాలీవుడ్ భామ.. ఎన్టీఆర్‌తో హాలీవుడ్ బ్యూటీ
ఈ భారీ ప్రాజెక్టులో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. అయితే రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ నటిస్తోంది. ఇక ఈ రెండు జోడీలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారట జక్కన్న.

సీత పాత్రలో ఆలియాభట్.. రాజమౌళి ప్లాన్
ప్రస్తుతం RRR షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఆలియా పాత్ర పరిధిని రాజమౌళి పెంచుతున్నాడని తెలుస్తోంది. అందులో భాగంగా ఓ సాంగ్‌ను చిత్రీకరించాలనుకుంటున్నాడని టాక్. అల్లూరి సీతారామరాజుగా కనపడబోతున్న రామ్‌చరణ్ కు జోడిగా సీత పాత్రలో ఆలియాభట్‌ను తీసుకున్నారు జక్కన్న.

ఓ ఊపు ఉపేయాల్సిందే.. జక్కన్న టార్గెట్
ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం ఆలియాభట్ పాత్ర పరిధి చిన్నదిగానే అనుకున్నారు. అయితే బాలీవుడ్‌లో RRR స్టేటస్‌ను పెంచుకునే ఉద్దేశంతో రాజమౌళి భారీ బడ్జెట్ ఆమెతో సాంగ్‌ను ప్లాన్ చేశాడని ఇన్‌సైడ్ టాక్. ఈ సాంగ్ దేశవ్యాప్తంగా ఓ ఊపు ఉపేయాల్సిందే అని రాజమౌళి టార్గెట్ పెట్టుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

వీలైనంత తొందరలో ఫినిష్..
డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్‌స్టార్ ఆలియాభట్, అజయ్ దేవగణ్‌తో పాటు హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్, అలిస్ డూడీ, ఒలివియా మోరిస్ తదితరులు నటిస్తున్నారు. చిత్రాన్ని వీలైనంత తొందరలో ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి.