For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్ కాస్ట్యూమ్స్ కి కోటి ఖర్చా?

  By Srikanya
  |

  హైదరాబాద్: అల్లు అర్జున్ తన కొత్త చిత్రంలో కాస్ట్యూమ్స్ కోసం కోటి రూపాయలు పైగా ఖర్చు పెట్టనున్నారనే వార్త అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. అల్లు అర్జున్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ డైరెక్ట్‌ చేయ బోతున్న 'ఇద్దరమ్మాయిలతో.. చిత్రం కోసం ఈ ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో క్యారెక్టర్ షో పుటప్ చేయటానికి ఈ రేంజి లో ఖర్చు పెట్టడానికి నిర్మాత బండ్ల గణేష్ సంతోషంగా ఒప్పుకున్నారని సమాచారం. పాత్ర ప్రకారం బన్ని ఈ చిత్రంలో వెరీటీ గెటప్స్ లో, రకరకాల కాస్ట్యూమ్స్ తో కనపడతాడని తెలుస్తోంది. అమలాపాల్‌, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ .

  అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ''కథ గురించి ఇప్పుడే ఏమీ చెప్పను. నాకెంతో నచ్చింది. ఎప్పట్నుంచో సినిమా చేద్దాం అని గణేష్ అడుగుతున్నారు. ఈ చిత్రంతో కుదిరింది. ఒక మంచి నిర్మాతకు కావల్సిన అన్ని లక్షణాలు గణేష్‌లో ఉన్నాయి. 'దేశముదురు' సమయంలో నేను సిక్స్‌ప్యాక్ చేయగలిగానంటే దానికి కారణం జగన్‌గారే. చెప్పిన సమయానికి షూటింగ్‌కి ప్యాకప్ చెప్పి, నాకు వర్కవుట్లు చేసుకునే అవకాశం కల్పించేవారు'' అన్నారు.

  పూరి చిత్రం గురించి చెబుతూ ''ఇదో ప్రేమ కథా చిత్రం. బన్నీ అంటేనే ఎనర్జీ. తనే కాదు సెట్‌లో అందర్నీ ఉత్సాహంగా ఉరకలేయిస్తారు. ఈ కథను అల్లు అరవింద్‌కు చెప్పినపుడు మావాడికి బాగుంటుందని చెప్పారు. తెలుగులో తొలి సిక్స్ ప్యాక్ హీరో. ఈ సినిమా కథను బన్నీకి చెప్పినప్పుడు.. మనమే చేద్దాం అన్నాడు. ఆ తర్వాత అరవింద్‌గార్ని కలిసినప్పుడు 'బన్నీకి ఒక కథ చెప్పావట.. అది తనతోనే చెయ్యి. తనకు బాగా నచ్చింది' అన్నారు. ఇది లవ్‌స్టోరి. నవంబర్ మొదటి వారంలో షూటింగ్ ఆరంభిస్తాం. న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాలో ఎక్కువ శాతం షూటింగ్ చేస్తాం''అన్నారు.

  నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ -''పూరి అన్ని చిత్రాల్లోకెల్లా ఇది వ్యత్యాసంగా ఉంటుంది. బన్నీతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అరవింద్‌గారిని అడుగుతున్నాను. బన్నీ నా రోల్ మోడల్. చాలా కష్టపడతాడు. 'నాయక్' కోసం అమలాపాల్ చేసిన డాన్స్ చూశాను. బ్రహ్మాండంగా చేసింది. మా బేనర్‌లో ఇది మరో సూపర్‌హిట్ మూవీ అవుతుంది. పూరి జగన్నాథ్‌తో సినిమా చేయాలని నాలుగేళ్లుగా అనుకుంటున్నాను. నిర్మాతగా నా కెరీర్‌ ఆయనతోనే మొదలుకావాల్సింది. ఇప్పటికి కుదిరింది. వచ్చే నెల తొలి వారం నుంచి చిత్రీకరణ మొదలుపెడతాము'' అన్నారు.

  అల్లు అర్జున్‌ని మాస్‌లోకి చొచ్చుకువెళ్లేలా చేసిన సినిమా 'దేశముదురు'. పూరి జగన్నాథ్ మార్క్ పాత్ర చిత్రణతో అందులో అల్లు అర్జున్ పూర్తి మాసివ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించారు. మళ్లీ వీరిద్దరి కలయికలో ఓ సినిమా రూపొందనుంది. వైవిధ్యభరితంగా టైటిల్స్ పెట్టే పూరి ఈ చిత్రం కోసం 'ఇద్దరమ్మాయిలతో' అనే టైటిల్ ఫిక్స్ చేయటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు . పూరి తరహా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందనుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌వర్మ.

  English summary
  Allu Arjun is preparing to take off with his new movie 'Iddaramayilatho' and just for his costumes, a whopping Rs 1 crore has been allocated. The producer for the film is Bandla Ganesh and he is not compromising on any aspect to ensure the film comes out with great quality and richness.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X