»   » భారీగా పెంచేసి మరీ ఎట్రాక్ట్ చేస్తున్న నయనతార

భారీగా పెంచేసి మరీ ఎట్రాక్ట్ చేస్తున్న నయనతార

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : సెకండ్ ఇన్నింగ్స్ లోనూ చెలరేగిపోతున్న హీరోయిన్ ఎవరూ అంటే నిస్సందేహంగా నయనతార అని చెప్పవచ్చు. తమిళ,తెలుగు పరిశ్రమలనుంచి వరస ఆఫర్స్ వచ్చి పడుతూండటంతో ఆమె తన రెమ్యునేషన్ ని భారీగా పెంచిందని సమాచారం. ముఖ్యంగా ఆమె తిరిగి శింబు ప్రక్కన చేయటానికి ఓకే చేయటానికి డబ్బే కారణమని తేలుస్తున్నారు.

పాండిరాజ్‌ దర్శకత్వంలో శింబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో నయనతారను హీరోయిన్ గా ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమెను నటింపజేయడానికి, అందుకు శింబును ఒప్పించడానికి దర్శకుడు సకల ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగమే పారితోషికం కూడా అని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. నయన్‌కు ఏకంగా రూ.2 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు కోలీవుడ్‌ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

శింబు, నయనతార కలిసి నటిస్తే అదే పెద్ద ప్రచారమని నిర్ణయించుకున్న చిత్ర యూనిట్‌.. భారీమొత్తం నయన్‌కు ఇవ్వడానికి ఒప్పుకుందట. తాజాగా ఉదయ్‌నిధి సరసన 'కదిర్‌వేలన్‌ కాదల్‌'లో నటించేందుకు రూ.1.4 కోట్లు తీసుకుందట నయనతార.

ఆ మధ్య పెళ్లి చేసుకుంటున్నానంటూ సినిమాలకు బై చెప్పేసిన నయనతార మళ్లీ ఊహించని విధంగా సీన్ లోకి వచ్చి బిజీ అయ్యింది. బిజీ అవ్వటమే కాక వరస హిట్స్ కొడుతోంది. తమిళంలో 'రాజా రాణి', 'ఆరంభం' సినిమాలతో వరుస విజయాలు అందుకొంది నయన్‌. తెలుగులో 'అనామిక'తో పాటు గోపీచంద్‌తో ఓ చిత్రం చేస్తోంది. ఈ నేఫద్యంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాక పట్టిందల్లా బంగారమే అన్నట్టుంది అని చెప్తోంది.

సెకండ్ ఇన్నింగ్స్ గురించి నయనతార మాట్లాడుతూ... ''చిత్ర పరిశ్రమకి నేనెప్పుడూ దూరం కాలేదు. అందుకే కెరీర్‌ని మళ్లీ కొత్తగా ప్రారంభించానని నాకెప్పుడూ అనిపించలేదు. అందరూ అంటున్నారు కాబట్టి నేను కూడా రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టాననే చెబుతున్నాను. నాపై ప్రేక్షకులు ఎప్పట్లాగే ఆదరణ చూపిస్తుండడం మాటల్లో చెప్పలేనంత అనుభూతినిస్తోంది. దర్శకులకు కూడా నాపై మరింత నమ్మకం పెరిగిందేమో మరి. అందరూ ప్రాధాన్యమున్న పాత్రలను అప్పజెబుతున్నారు. ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?'' అని చెప్పుకొచ్చింది.

English summary
Nayantara is already getting a remuneration of around Rs 1.25 lakh per film, especially if the hero is ‘upmarket’. In case of an upcoming hero, she demands above Rs. 2 crore! Keeping in mind her fan following among the youth, producers are accepting her demands. However, some Telugu producers are still holding out as they are sceptical of her worth in the box office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu