twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కాంచన' 3D కన్వర్షన్ ఖర్చు ఎంతటే...

    By Srikanya
    |

    హైదరాబాద్: లారెన్స్ సూపర్ హిట్ హర్రర్ చిత్రం 'కాంచన' ను 3D లోకి కన్వర్షన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కన్వర్షన్ కోసం ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. రజనీ కాంత్ శివాజీ కన్వర్షన్ కి 11 కోట్లు ఖర్చు పెడుతూంటే, కాంచన కూడా మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఈ రేంజి ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. ఈ విషయమై బెల్లంకొండ సురేష్ ని సంప్రదించగా.." డబ్బు విషయం అనేది ప్రక్కన పెడితే, కొన్ని సెలిక్టివ్ సినిమాలను మాత్రమే 3డి వెర్షన్ లో చూడగలుగుతాం, కాంచన అటువంటి సినిమానే,ఈ సినిమా పూర్తిగా పొటిన్షియల్ కలిగి ఉంది. 3డిలో ప్రేక్షకులు ధ్రిల్ అయ్యి పూర్తిగా ఎంజాయ్ చెయ్యగలుగుతారని చెప్పగలను.. ఒరిజనల్ బ్లాక్ బస్టర్ అయినా 3డిలో కన్వర్ట్ చేయటానికి కారణం అదే. డబ్బు అనేది ఇలాంటి ప్రయత్నాలకు ఎప్పుడూ సెకండరీనే," అన్నారు.

    క్రితం సంవత్సరం రాఘవ లారెన్స్ డైరక్ట్ చేసిన హిట్ సినిమా కాంచన. ఈ చిత్రం ఇప్పుడు బెల్లంకొండ సురేష్ ఈ విషయం మీడియాకు తెలియచేసారు. త్రిడీలోకి కన్వర్ట్ చేసి రీరిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... మేము ఇప్పటికే ఈ కన్వర్షన్ ప్రాసెస్ ని ప్రారంభించాం. ఇక ఈ 3D వెర్షన్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా లారెన్స్ పై ఓ పాటను చిత్రీకరించి కలుపుతున్నాం..ఈ సినిమా గ్యారెంటీగా అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో రాఘవలాన్స్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన చిత్రం 'కాంచన'.

    ఇక రజనీకాంత్‌,శంకర్‌ కలయికలో వచ్చి సూపర్ హిట్టైన చిత్రం 'శివాజి'. శ్రియ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ఏవీయమ్‌ సంస్థ నిర్మించింది. ఇప్పుడీ చిత్రాన్ని త్రీడీలోకి మారుస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది నుంచి ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అయితే త్రీడీ సినిమా కోసం నిడివి తగ్గించాల్సి వస్తోంది. కథాగమనం దెబ్బతినకుండా కొన్ని సన్నివేశాలను
    తొలగించడానికి చిత్రబృందం ప్రయత్నిస్తోంది.

    ఇక ఈ చిత్రం 185 నిమిషాలపాటు సాగుతూంటే యాక్షన్ ఎంటర్టైనర్. ప్రస్తుతం త్రీడి వెర్షన్ కోసం 137 నిమిషాలకు కుదిస్తున్నారు. అంటే 48 నిమిషాల నిడివి గల సన్నివేశాలకు కత్తెర్లు పడతాయన్నమాట. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. 2డీ పరిజ్ఞానంతో చిత్రించిన ఈ సినిమాను ఇప్పుడు త్రీడీలోకి మారుస్తున్నారు. చెన్నైలోని ప్రసాద్‌ ఈఎఫ్‌ఎక్స్‌లో ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి.''పదిహేను రోజుల క్రితం 'శివాజీ' సినిమా చూడమని చెప్పారు. ఇందులోని 'వాజీ.. వాజీ..' పాట చూశాను. నాకే ఆశ్చర్యమేసింది. అసలు నటించింది నేనేనా అనుకొన్నాను. నిజం చెప్పాలంటే ఇది నా అభిమానులకు పెద్ద విందుగా ఉంటుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. సెప్టెంబరులో ప్రపంచవ్యాప్తంగా తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి''అన్నారు రజనీకాంత్.

    English summary
    Rajinikant’s Sivaji spent over Rs 11 crore to convert their film into 3D, Tollywood producers are matching them step for step. Bellamkonda Suresh has reportedly set aside Rs 5 crore to convert horror film, Kanchana, into 3D. “Instead of talking about money, I would say that only selective films with visually captivating scenes justify a 3D conversion. Kanchana, a nail-biting horror flick, has enough potential to thrill the audience. Also the original was a blockbuster. So, I intend to give Andhra movie buffs, some goose-bumps with Kanchana in 3D. Money is secondary in this novel attempt,” said Bellamkonda Suresh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X