»   » అల్లు అర్జున్ కొత్త చిత్రానికి మూడు కోట్ల సెట్

అల్లు అర్జున్ కొత్త చిత్రానికి మూడు కోట్ల సెట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్, వివి వినాయిక్ కాంబినేషన్ లో ప్రారంభకానున్న బద్రీనాధ్ చిత్రం కోసం మూడు కోట్ల రూపాయల విలువ చేసే సెట్ ని నిర్మిస్తున్నట్లు సమాచారం. ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయి పర్యవేక్షణలో ఈ సెట్ వేస్తున్నారు. సినిమాలో మేజర్ పార్ట్ షూటింగ్ ఇందులోనే జరుగుతుందని చెప్తున్నారు. ఇక ఈ చిత్రానికి దాదాపు నలభై కోట్ల వరకూ బడ్జెట్ అవుతుందని, గ్రాఫిక్స్ అవీ ఫుష్కలంగా ఉంటాయని చెప్తున్నారు. అలాగే హ్యాపీడేస్ భామ తమన్నా ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన చేస్తోంది. గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిన్నికృష్ణ కథ అందిస్తున్నారు. చిన్ని కృష్ణ గతంలో నరసింహనాయుడు, గంగోత్రి, ఇంద్ర వంటి చిత్రాలుకు కథలు అందించారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మగధీర రికార్డులను బ్రద్దలు కొట్టేలా ప్లాన్ చేస్తున్నారని యూనిట్ వర్గాలు చెప్తున్నారు. ఇంతకు ముందు వినాయిక్, అల్లు అర్జున్ కాంబినేషన్లో బన్నీ చిత్రం వచ్చి మంచి హిట్టయిన సంగతి తెలిసిందే. ఇక అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ రూపొందించిన వరుడు చిత్రం ఈ వారంలోనే రిలీజ్ అవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu