»   » ‘రుద్రమదేవి’ మళ్లీ వాయిదా అంటున్నారా?

‘రుద్రమదేవి’ మళ్లీ వాయిదా అంటున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రుద్రమేదవి' అనుకున్న సమయానికి విడుదల విషయంలో సతమతం అవుతూనే ఉంది. ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని జూన్ 26న విడుదల చేయాలని డిసైడ్ చేసారు.

అయితే ఎక్స్ టెన్సివ్ గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కానందున సినిమాను అనుకున్న సమయానికి ఈ నెల 26న విడుదల చేయడం కష్టమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. గుణ శేఖర్ దగ్గరుండి కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే గుణశేఖర్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడని, అందుకే సినిమా ఆలస్యం అవుతోందని అంటున్నారు. ఏవిషయం అనేది తేలాల్సి ఉంది.


Also Read: హాట్ న్యూస్: మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ (ఫొటోలుతో)


Rudhramadevi To Get Postponed Again?

అనుష్క, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్ ఇలా ఎంతరో ప్రముఖ స్టార్స్ ఈ చిత్రంలో నటించారు. సినిమాపై అంచనాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రచార కార్యక్రమాలు కూడా తగ్గించారు. అయితే ఇటీవలే ఈ చిత్రానికి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నారనే వార్త బయటకు వచ్చింది. ఈ వార్త సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచింది.


గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

English summary
Rudhramadevi, which is slated to release on June 26, might not see light on the given date, informed a source close to the team. "Due to extensive CG work, the film might not be released on time and Gunasekhar is busy monitoring the computer graphics. He's not compromising in the quality of product and hence it's delayed, added the source.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu