twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అయ్యో.... ‘రుద్రమదేవి’ మళ్లీ వాయిదా పడిందా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘రుద్రమదేవి'. వేసవి ప్రారంభంలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు సెప్టెంబర్ 4న విడుదలకు సిద్ధమైంది. సినిమా ప్రచారానికి రథం కూడా సిద్ధమైంది. అయితే సినిమా ఈ సారి కూడా అనుకున్న సమయానికి విడుదలయ్యే అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది. పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడమే ఈ ఆలస్యానికి కారణం అని అంటున్నారు.

    ఎప్పుడు విడుదలవుతుందనే విషయమై క్లారిటీ లేదు. సెప్టెంబర్ 11, లేదా సెప్టెంబర్ 18న విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరో వైపు సెప్టెంబర్ 17న తమిళ హీరో విజయ్ ‘పులి' చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో థియేటర్లు అడ్జెస్ట్ కాకపోతే అక్టోబర్ 2న విడుదలయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. దర్శకుడు గుణశేఖర్ అఫీషియల్ గా ప్రకటిస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

    గతంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో.. రుద్రమదేవి సినిమా తెలుగు వారు గర్వపడేలా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు గుణశేఖర్ తెలిపారు. గుణశేఖర్ అంటే భారీ సెట్లు వేస్తాడనే అపోహ ఉంది. కానీ రుద్రమదేవి విషయంలో కథే ముఖ్యమైంది. కథకు అనుగుణంగానే సెట్స్ వేసాను. రుద్రమదేవి క్యారెక్టర్ కు అనుష్క అయితేనే న్యాయం చేస్తుందని అందరూ అన్నారు. అలా ప్రజలే అనుష్కను రుద్రమ దేవిగా నిర్ణయించారు. అనుష్క ఈ సినిమా కోసం చాలా కష్టపడింది అన్నారు.

    Rudramadevi postponed yet again

    అల్లు అర్జున్‌‌కి వరుడు సినిమా టైంలో ఈ సినిమా గురించి చెప్పాను. గోనగన్నారెడ్డి పాత్ర చేయమని అడగ్గానే ఆనందంగా ఒప్పుకున్నాడు. 35 రోజులు పాటు ట్రైనింగ్ తీసుకుని 35 రోజులు షూటింగులో పాల్గొన్నాడు. సినిమా కోసం తోట తరణి అద్భుతమైన సెట్స్ వేసారు. ఇళయరాజా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. లండన్‌లో రీ రికార్డింగ్ చేసామని గుణశేఖర్ తెలిపారు.

    అనుష్క, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్, కేథరిన్ తెరిస్సా, ఆదిత్య మీనన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

    English summary
    Rudramadevi postponed yet again. There is also another important reason for the postponement. As Vijay’s Puli is said to release on September 17th, most of the theaters have been filled by Vijay’s Puli.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X