»   »  ఆ ఎఫైర్ క్లైమాక్స్ కొచ్చిందిట!!

ఆ ఎఫైర్ క్లైమాక్స్ కొచ్చిందిట!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కామిడి హీరోగా ముద్ర వేయించుకుని తెలుగు తెరపై దూసుకుపోతున్న కుర్రాడు అల్లరి నరేష్. అలాగే 'భాగ్యలక్ష్మి బంపర్ డ్రా' సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన పంజాబీ అమ్మాయి ఫర్జానా. వాళ్ళిద్దరూ 'సీమశాస్త్రి, బొమ్మనాబ్రదర్స్, చందనా సిస్టర్స్' చిత్రాల్లో కలిసి నటించారు. అలాగే వారి మధ్య ఏదో ఉందంటూ ఆమధ్య తెలుగు పరిశ్రమలో గుసగుసలు జోరుగా వినిపించాయి. అందువల్లే తన చిత్రాల్లో హీరోయిన్‌గా ఫర్జానానే తీసుకోవాలని కూడా నరేష్ పట్టుపడుతున్నాడని కూడా చెప్పుకున్నారు. అయితే నరేష్‌తో ప్రేమ వ్యవహారం పుకార్లేనని తమ మధ్య అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది ఫర్జానా . అంతేగాక తాము కలసి నటించిన చిత్రాలు విజయం సాధించడంతో నిర్మాతలు తమను జంటగా నటించాలని కోరేవారని అంతకన్నా తమ మధ్య మరేమీ లేదని ఆమె తెగేసి మరీ చెప్పేసింది. అలాగే నరేష్ కూడా తనకు ఫర్జానాతో ఎలాంటి ప్రేమానుబంధం లేదని ఆమె చెప్పేదాన్ని సపోర్ట్ చేసాడు. దాంతో అంతా ఊరుకున్నారు. కాని ఇప్పుడు రివర్స్ లో వారి ప్రేమ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతున్నట్లు కనిపిస్తోంది.

నిజానికి నరేష్, ఫర్జానా గత ఆరు నెలలుపైగా కలిసి తిరుగుతున్న సంగతిని ఫిల్మ్ నగర్ లో అందరూ చెప్పుకునే బహిరంగ రహస్యం. అంతేగాక ఫర్జానా తన కెరీర్ మీద కాకుండా నరేష్ మీదే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నదట. తనను ప్రేమిస్తున్నట్లు బహిరంగంగా ఒప్పుకోవాల్సిందిగా నరేష్‌పై ఫర్జానా ఒత్తిడి తెస్తున్నదనీ, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరిస్తున్నదనీ పుకార్లు వినపడుతున్నాయి. అలాగే తనను అన్ని రకాలుగా ఉపయోగించుకుని ఇప్పుడు తనతో సంబంధం లేదని చెబితే ఊరుకోనని ఆమె నరేష్‌ను హెచ్చరించిందట. బయిట మీడియా వారితో మాత్రం ప్రస్తుతం తన దృష్టి ప్రస్తుతానికి కెరీర్ మీదే ఉందని 1977 చిత్రం ద్వారా తమిళంలో సైతం పరిచయమవుతున్నానని, ఆమె చెప్పింది. ఇక నరేష్ తన తండ్రి దర్శకత్వంలో చేస్తున్న ఫిటింగ్ మాస్టర్ చిత్రంలోనూ,వేగేష్న సతీష్ తొలిసారి డైరక్ట్ చేస్తున్న దొంగల బండి లోనూ బిజీగా ఉన్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X