»   » మెగా కుట్ర: ‘రేసు గుర్రం’ చిత్రాన్ని తొక్కేయడమే లక్ష్యం?

మెగా కుట్ర: ‘రేసు గుర్రం’ చిత్రాన్ని తొక్కేయడమే లక్ష్యం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో 'రేసు గుర్రం' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న వేళ ఈ చిత్రంపై షాకింగ్ రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఇంకా సినిమా విడుదల కానేలేదు...ఈ చిత్రం వివిధ చిత్రాలను కాపీ కొట్టి తీసారని, ఓ తమిళ సినిమా నుండి మెయిన్ స్టోరీని ఎత్తుకొచ్చారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇటీవల ఈచిత్రం ట్రైలర్ విడుదలైన నేపథ్యంలో...ట్రైలర్లోని సీన్లు గతంలో వచ్చిన సినిమాల్లోని సీన్లు పోలి ఉన్నాయని కొందరు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇదంతా బన్నీ సినిమాపై కావాలని జరుగుతున్న కుట్రే అని, సినిమాపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం వల్ల పరిశ్రమలో బన్నీ జోరును తగ్గించాలనే ఉద్దేశంతో యాంటీ ఫ్యాన్స్ కొందరు కుట్ర చేస్తున్నారని అల్లు అర్జున్ అభిమానులు అంటున్నారు.

Rumors on Race Gurram movie

మెగా కుటుంబానికి చెందిన హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే....కావాలనే ఓ వర్గానికి చెందిన వారు, మెగాఫ్యామిలీ సినిమాలను టార్గెట్‌గా చేసుకుని ఇలాంటి తప్పుడు పుకార్లు ప్రచారంలోకి తేవడం, కుట్రపూరితంగా సినిమా విజయాన్ని అడ్డుకునే ప్రయత్నంచేయడం చాలా కాలంగా జరుగుతోందని అంటున్నారు.

ఇక రేసు గుర్రం చిత్రంలో కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్, దర్శకత్వం: సురేందర్ రెడ్డి.

English summary
Race Gurram movie gearing up to hit screens in few days from now, there are rumors that the movie is not Surender Reddy's original but a lift from a Tamil movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu