»   » రిలీజ్ డేట్ మళ్లీ మార్చారా?... డౌట్స్ వస్తాయి బాబూ

రిలీజ్ డేట్ మళ్లీ మార్చారా?... డౌట్స్ వస్తాయి బాబూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఓ చిత్రం వరసగా వాయిదాలు పడుతోందంటే రకరకాల సందేహాలు వస్తూంటాయి. తాజాగా శర్వానంద్ తాజా చిత్రం ఇలాంటి సమస్యను ఎదుర్కొంటోంది. శర్వానంద్, సీరత్ కపూర్ జంటగా యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి. వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'రన్ రాజా.. రన్'. ఈ చిత్రం గతంలో జూలై 11న విడుదల అన్నారు. ఆ తర్వాత 18 వ తేదీకి వాయిదా వేసారు. ఇప్పుడు మరోసారి ఈ చిత్రం ఆగస్టు మొదటి వారానికి వాయిదా పడంది.

ఇలా వరసగా రిలీజ్ వాయిదాలు పడటం వెనక కారణం ఏమై ఉంటుందనే విషయం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. బిజినెస్ కాకే ఇలా రిలీజ్ వాయిదా వేస్తున్నారని, అయితే దాన్ని పోస్ట్ ప్రొడక్షన్ లేటు అనే కారణం చూపెడుతున్నారని చెప్పుకుంటున్నారు. అయితే అసలు కారణం ఏంటనేది ఎవరికి తెలయటం లేదు. ఇప్పుటికే పాటలు, టీజర్స్ మార్కెట్‌లో విడుదలయ్యి మంచి టాక్ సంపాదించుకున్నాయి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం సమకూర్చారు.

Run Raja Run from Release date!

ప్రభాస్ మాట్లాడుతూ "కొరటాల శివను దర్శకుడిగా పరిచయం చేసి 'మిర్చి'తో పెద్ద విజయాన్ని అందుకున్న వంశీ, ప్రమోద్ ఇప్పుడు సుజిత్‌ను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ 'రన్ రాజా రన్'ను తీస్తుండటం సంతోషంగా ఉంది. 24 ఏళ్ల వయసులో సుజిత్‌లో ఇంత ప్రతిభ ఉందని నేను ఊహించలేదు. పబ్లిసిటీ కోసం ఈ నిర్మాతలు బాగా ఖర్చు పెడతారనే నమ్మకంతో శర్వానంద్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ అడగలేదు'' అని చెప్పారు.

అడివి శేష్, సంపత్, జయప్రకాశ్‌రెడ్డి, వెన్నెల కిశోర్, అలీ, కోట శ్రీనివాసరావు, విద్యుల్లేఖ రామన్, అజయ్ ఘోష్ తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: ఘిబ్రాన్ ఎం., ఛాయాగ్రహణం: మధి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, లైన్ ప్రొడ్యూసర్: సందీప్.

English summary

 Sharvanand,Seerath Kapoor starrer ‘Run Raja Run’ directed by Sujith is getting ready to hit the screens soon.Now all of sudden the plans has changed and the film makers announced that the film will not be released as announced. Now it may release in Aug 1st week.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu