»   » అతని ట్యూన్స్ థమన్ కాపీ కొట్టాడా?

అతని ట్యూన్స్ థమన్ కాపీ కొట్టాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎస్ఎస్ థమన్...తెలుగులో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అవడంతో పాటు ఎక్కువ సినిమాలకు సంగీతం అందించడం.. మహేష్ బాబు, రవితేజ, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో పని చేసే అవకాశం దక్కించుకున్న మ్యూజిక్ డైరెక్టర్. అయితే థమన్‌ ఇతర భాషా చిత్రాల్లోని ట్యూన్స్ కాపీ చేస్తాడనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా థమన్..... తమిళ ‘కత్తి' చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ కంపోజ్ చేసిన ట్యూన్స్ కాపీ కొట్టాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొలవెరి సాంగుతో వెలుగులోకి వచ్చిన అనిరుధ్ రవిచంద్రన్ డిఫరెంట్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘కత్తి' సినిమాకు అతను అందించిన డిఫరెంట్ సౌండింగ్ వింటే అతని ప్రతిభ ఏమిటో స్పష్టమవుతుంది. ఆ ట్యూన్స్ థమన్‌కు నచ్చడంతో....సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘టైగర్' చిత్రం కోసం కాపీ చేసాడని అంటున్నారు.

S Thaman Copied Anirudh Ravichander's Tunes For Sundeep Kishan's Tiger?

‘టైగర్' చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల శిల్పకళా వేదికలో జరిగింది. ఆడియో విన్న వారంతా....కత్తి సినిమా ట్యూన్స్ మాదిరిగా ఉన్నాయని అంటున్నారు. థమన్‌పై ఇప్పటికే కాపీ మాస్టర్ అనే ఆరోపణలు ఉన్నాయి....ఈ నేపథ్యంలో ‘కత్తి' ట్యూన్స్ మాదిరిగా ఉన్న ‘టైగర్' ట్యూన్స్ విని పలువురు సంగీత ప్రియులు విస్తుపోయారు.

గతంలో రవితేజ-హన్సిక హీరో హీరోయిన్లుగా వచ్చిన ‘పవర్' చిత్రానికి థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ట్యూన్స్ బాలీవుడ్ పాపులర్ ట్రాక్...సారీ కా ఫాల్ సాను పోలి ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. గతేడాది థమన్ తెలుగు, తమిళంలో కలిసి దాదాపు 10 సినిమాలు చేసారు. ప్రస్తుతం అతని చేతిలో రెండు మూడు కంటే ఎక్కువగా లేవు. వరుసగా వివిధ సినిమాల నుండి ట్యూన్స్ కాపీ కొట్టడం వల్లనే అతనికి అవకాశాలు తగ్గాయని మ్యూజిక్ అవర్స్ అభిప్రాయ పడుతున్నారు.

అయితే కొందరు థమన్ అభిమానులు మాత్రం...ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడానికి ఒకటి రెండు ట్యూన్స్ కాపీ చేయడంలో తప్పేమీ లేదని అంటున్నారు. మరి ఈ ఆరోపణలకు థమన్ ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.

English summary
S Thaman made it big in the Telugu film industry in a very less period of time with his rocking numbers. But he has always been alleged for copying tunes from different languages and the latest being the tunes scored by Anirudh Ravichander for Kaththi
Please Wait while comments are loading...