For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సాహో దర్శకుడు మళ్ళీ ఫోకస్ పెట్టాడు.. ఆ హీరో ఒప్పుకుంటే లక్కీ ఛాన్స్ కొట్టినట్లే?

  |

  ఫస్ట్ టైం శర్వానంద్ హీరోగా తెరకెక్కిన రన్ రాజా రన్ మూవీ తో సుజిత్ టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ తరువాత సూపర్ హిట్ కొట్టింది. ఇక ఇందులోని సాంగ్స్ ఇప్పటికీ కూడా అక్కడక్కడా వినపడుతూనే ఉంటాయి. ఆ విధంగా రన్ రాజా రన్ మూవీకి అదిరిపోయేలా సాంగ్స్ తీసుకున్నారు సుజీత్. దానితో బాహుబలి వంటి భారీ విజయాల తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సుజీత్ కి తన నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ తో ప్రభాస్ చేసిన సినిమానే సాహో. బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కి 2019 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

  అయితే ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు లో యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ అటు నార్త్ లో మాత్రం భారీగా సక్సెస్ సాధించి అద్భుతంగా కలెక్షన్స్ అందుకుంది. భారీ యాక్షన్ తో కూడిన విజువల్ వండర్ గా సుజీత్ తీసిన ఈ సినిమాలో సాంగ్స్ బాగానే ఆకట్టుకోగా కథ, స్క్రీన్ ప్లే పరంగా ఆసక్తికరంగా లేకపోవడంతో సినిమాని ఆడియన్స్ పెద్దగా ఆదరించలేదు. అయితే ఆ తరువాత సుజీత్, మెగాస్టార్ తో ఒక సినిమా చేయనున్నారు అంటూ కొన్ని నెలల క్రితం వార్తలు వచ్చినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఇక అసలు విషయం ఏమిటంటే, లేటెస్ట్ ఫిలిం నగర్ న్యూస్ ప్రకారం ప్రభాస్ తోనే త్వరలో మరొకసారి సుజీత్ తో ఒక భారీ సినిమా చేయనున్నారట.

  Saaho director sujeeth uv creations another big plan

  ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పాత్రలో నెవ్వర్ బిఫోర్ అనేలా కనిపిస్తాడట, భారీ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ మూవీ స్టోరీపై ఇప్పటికే ప్రభాస్ పాజిటివ్ గా కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుజీత్ దీని పూర్తి స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నారని, త్వరలో అది ప్రభాస్ కి వినిపించిన అనంతరం దీనికి సంబంధించి అఫీషియల్ న్యూస్ బయటకు వస్తుందని అంటున్నారు. అయితే ఇటీవల రాధేశ్యామ్ షూట్ మొత్తం పూర్తి చేసిన ప్రభాస్, ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజక్ట్ కె సినిమాలు చేస్తున్నారు.

  మరోవైపు ఏ మాత్రం షెడ్యూల్స్ గ్యాప్ లేకుండా ఈ మూడు సినిమాల షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటున్నారని, అయితే ఇవి పూర్తి అయిన తరువాతనే సుజిత్ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. ఒకవేళ సినిమా సెట్టయితే సాహో తరహాలో ఆలస్యం కాకుండా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా సుజీత్ కి ప్రభాస్ ఒకింత గట్టిగా సూచన చేసారని తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నాళ్లపాటు ఎదురుచూడక తప్పదు. ఇక సుజిత్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమా చేసేందుకు ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.

  English summary
  Saaho director sujeeth uv creations another big plan
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X