For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తెలుగులో దేకలేదు..తమిళంకి రీమేక్

  By Srikanya
  |

  హైదరాబాద్ : కథలు ఇచ్చిపుచ్చుకొనే సంప్రదాయం కొనసాగుతోంది. తెలుగులో విజయవంతమైన కథలు...తమిళంకి వెళుతున్నాయి. అక్కడి కథలు తెలుగులోకీ దిగుమతి అవుతున్నాయి. ఆ జాబితాలో ఇప్పుడు 'ఆషికి 2' కూడా చేరింది. హిందీలో ఘన విజయం సాధించిన చిత్రాన్ని తెలుుగులోకి 'నీజతగా నేనుండాలి' టైటిల్ తో రీమేక్ చేసి విడుదల చేసాడు. ఇక్కడ ఆ సినిమా ఆడలేదు. అయినా ఇప్పుడా చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సచిన్ ఈ ప్లానింగ్ లో ఉన్నట్లు సమాచారం. అయితే డబ్బింగ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఉందని తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.

  తెలుగులో పరమేశ్వర ఆర్ట్స్‌ పతాకంపై బండ్ల గణేష్‌ పునర్నిర్మించారు. సచిన్‌ హీరోగా నటిస్తున్నారు. సంజయ్‌ దత్‌ మేనకోడలు నజియా హీరోయిన్ గా పరిచయయ్యింది. జయ రవీంద్ర దర్శకుడు. రెండు వారాల క్రితం ఈ చిత్రం విడుదలై మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. సరైన ఓపినింగ్స్ తెచ్చుకోలేకపోయిన ఈ చిత్రం కంటెంట్ తగ్గ కాస్టింగ్ లేదని, ఎమోషన్స్ సరిగ్గా తెరపై పండించలేకపోయాడని పేరు తెచ్చుకుంది.

  Sachin making Aashiqui 2 in Tamil

  చిత్రం కథ ఏమిటంటే... తాగుడుకి బానిసై తన పేరంతా పోగొట్టుకున్న యువ గాయకుడు రాఘవ్ జైరాం(సచిన్ జోషి). ఆ పరిస్ధితుల్లో అతని జీవితంలోకి గాయిత్రీ నందన(నజియా) ప్రవేశిస్తుంది. ఆమె పాడిన విని పరవసించిన రాఘవ్..ఆమెను పెద్ద గాయని చేస్తానని మాట ఇస్తాడు. మాట నిలబెట్టుకునేందుకు పెద్ద కంపెనీలలో అవకాసాలు ఇప్పిస్తాడు. దాంతో ఆమె కూడా టాప్ సింగర్ గా ఎదుగుతుంది...దాంతో పాటే వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించి పెరుగుతుంది. కానీ రాఘవ్ మాత్రం ప్రేమకైనా దూరం అవుతాను కానీ త్రాగుడు మానలేను అన్నట్లు ఉంటాడు. దాంతో గాయిత్రి తన కెరీర్ ని ప్రక్కన పెట్టి తనకు లైఫ్ ఇచ్చిన రాఘవ్ ని మామూలు మనిషిని చేయటానికి ప్రయత్నించాలని నిర్ణయించుకుంది.. అప్పుడు రాఘవ్ ఏం చేసాడు.. వారి ప్రేమ కథ ఏమైంది అన్నది మిగతా కథ.

  దర్శకుడు మాట్లాడుతూ ''హిందీ 'ఆషికి 2' ఎంతగానో నచ్చింది. ఇలాంటి సినిమాను నేనూ తీయాలనుకొన్నా. అయితే... ఇప్పుడదే చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించే అవకాశం రావడం ఆనందాన్నిచ్చింది'' అన్నారు.

  బండ్ల గణేష్‌ మాట్లాడుతూ ''ఇదివరకు 'దబాంగ్‌' చిత్రాన్ని తెలుగులో 'గబ్బర్‌సింగ్‌'గా తీసి విజయాన్ని అందుకొన్నాం. అదే తరహాలో ఇప్పుడు 'ఆషికి 2'ని పునర్నిర్మిచాం. కథ నచ్చి ఈ సినిమా హక్కులు కొన్నా. సచిన్‌ నాకు ఆత్మీయుడు. ఆయన హిందీలో నటిస్తూ బిజీగా కొనసాగుతున్నప్పటికీ మా చిత్రంలో నటించేందుకు ఒప్పుకొన్నారు. దర్శకుడు జయరవీంద్ర తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథని మలిచాడు. సంగీతాన్ని యథాతథంగా వాడాం. ఒకే షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తి చేసాం''అన్నారు.

  సచిన్‌ మాట్లాడుతూ ''ఎనిమిదేళ్ల క్రితం తెలుగులో 'ఒరేయ్‌ పండు' సినిమాలో నటించాను. సుదీర్ఘ విరామం తర్వాత మరొక మంచి చిత్రంలో నటించటం చాలా ఆనందంగా ఉంది'' అన్నారు. ఈ చిత్రంలో కాశీ విశ్వనాథ్‌, రావు రమేష్‌, శశాంక్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పాటలు: చంద్రబోస్‌, మాటలు: మధుసూధన్‌, ఛాయాగ్రహణం: ఎ.వసంత్‌, సంగీతం: అంకిత్‌ తివారి, సమర్పణ: శివబాబు బండ్ల.

  English summary
  Sachin attempt of re-making ‘Aashiqui 2’ in Telugu sank without a whimper in industry, the actor is all set to re-make it in Tamil and play the lead role again.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X