»   »  అదే టైటిల్ : నితిన్, రామ్, ఇప్పుడు సాయి ధరమ్ తేజకు

అదే టైటిల్ : నితిన్, రామ్, ఇప్పుడు సాయి ధరమ్ తేజకు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొన్ని టైటిల్స్ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ప్రచారంలోకి వస్తాయి. దర్సక,నిర్మాతలు కూడా ఆ టైటిల్ నే పెడదామని ఉత్సాహపడతారు. అయితే ఆ తర్వాత అంతకన్నా మంచి టైటిల్ దొరకటమో లేక న్యూమరాలిజీ ప్రకారం టైటిల్ నప్పలేదనో, లేకపోతే కథ ప్రకారం మరో టైటిల్ కావాల్సి వచ్చో ఆ టైటిల్ వద్దనుకుంటారు.

అయితే ఈ గ్యాప్ లో ఆ టైటిల్ బాగా ప్రచారంలోకి వచ్చేస్తోంది. దాంతో మరో హీరోకు అదే టైటిల్ పెడుతూంటారు. ఇలా చాలా సార్లు ఇండస్ట్రీలో జరిగింది. జరుగుతుంది కూడా. అలాంటి ఓ టైటిల్ గురించి ఇక్కడ చెప్పుకుందాం.

Sai Dharam, Gopichand Film Titled

నితిన్ హీరోగా మల్లిడి వేణు దర్శకత్వంలో రూపొందే చిత్రానికి ఆకతాయి అనే టైటిల్ అప్పట్లో అనుకోవటం జరిగింది. అయితే ఆ ప్రాజెక్టు అనుకోని అవాంతరాలతో ఆగిపోయింది. ఆ తర్వాత అదే కథతో, రామ్ ని ఒప్పించాడీ దర్సకుడు. అప్పుడు కూడా ఇదే టైటిల్ అనుకున్నారు. పండుగ చేస్కో చిత్రం తర్వాత ఎక్కాల్సిన ప్రాజెక్టు ఇది. అయితే అదీ ముందుకు వెళ్ళలేదు.


తర్వాత అదే టైటిల్ తో ఇప్పుడు దర్శకుడు గోపీచంద్ మలినేని, మెగా సాయి ధరమ్ తేజ తో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. మే నెల నుంచి సెట్స్ కు వెళ్లే ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తోంది. పూర్తి మాస్ మసాలా చిత్రంగా దీన్ని తెరకు ఎక్కిస్తున్నారు.

English summary
It is coming out that Sai Dharam Tej is starring in the direction of Gopichand Malineni.According to sources, film is titled as ‘Aakatayi’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu