»   » సాయి ధరమ్ తేజ, అనీల్ రావిపూడి చిత్రం టైటిల్

సాయి ధరమ్ తేజ, అనీల్ రావిపూడి చిత్రం టైటిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సాయి ధరమ్ తేజ త్వరలో పటాస్ డైరక్టర్ అనీల్ రావిపూడి దర్శకత్వంలో చిత్రం చేయటానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం విజయ దశమి రోజు లాంచ్ అవనుంది. నవంబర్ నుంచి రెగ్యలర్ షూటింగ్ కు వెళ్లనుంది. ఈ చిత్రానికి ‘ సుప్రీమ్'అనే టైటిల్ ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ఎంటర్టైన్మెంట్ తో కూడిన యాక్షన్ తో ఈ చిత్రం సాగనుంది. సుప్రీమ్ అనేది అప్పట్లో చిరంజీవి బిరుదు అనే సంగతి తెలిసిందే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ తన తాజా చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్' రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదల అవుతోంది. ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.

అలాగే సాయిధరమ్ తేజ మరో చిత్రం కమిటయ్యారు. కళ్యాణ్ రామ్ తో ఓం తీసిన సునీల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం లాంచింగ్ ఈ రోజు జరిగింది. ఈ చిత్రానికి సంభందించి తిక్క అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. దానికి ట్యాగ్ లైన్ గా... ‘హ్యాండిల్ విత్ కేర్' అని పెడుతున్నట్లు తెలుస్తోంది.రోహిన్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత.

డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి నెంబర్ వన్ టెక్నిషియన్స్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. ఈ టైటిల్ ని బట్టి ఇదో యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్దమవుతోంది. సినిమాలో ఎక్కువ భాగం శ్రీలంకలో షూటింగ్ జరగనుంది. ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుందని దర్శక,నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.

 Sai Dharam with Anil Ravipudi film titled?

'సుబ్రమణ్యం ఫర్ సేల్' విషయానికి వస్తే....

''ఇప్పటివరకూ కథనే నమ్ముకొని సినిమాలు తీశాం. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' కూడా చక్కని కథతో రూపొందనున్న సినిమా. హరీశ్ శంకర్‌తో నేను తీసిన 'రామయ్య వస్తావయ్యా' అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేదు. అయినా... అతని ప్రతిభపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాతో సాయిధరమ్‌తేజ్ స్టార్ హీరో అవుతాడు'' అని 'దిల్' రాజు అన్నారు.

అలాగే ..'దిల్' రాజు మాట్లాడుతూ - ''సాయిధరమ్‌తేజ్ నటించిన సినిమా ఏదీ విడుదల కాకముందే... అతను హీరోగా సినిమాను ప్రారంభించామంటే... అతనిపై, హరీశ్‌శంకర్ కథపై మాకున్న నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. '' అని తెలిపారు.

'''మిరపకాయ్' టైమ్‌లోనే ఈ టైటిల్‌ని మీడియాకు తెలియజేశాను. అప్పట్నుంచీ ఈ కథపై కసరత్తులు చేస్తూనే ఉన్నాను. అయితే... ఎవరితో చేయాలనేది మాత్రం క్లారిటీ లేదు. 'గబ్బర్‌సింగ్' టైమ్‌లో పవన్‌కల్యాణ్‌గారితో సాయిధరమ్‌తేజ్‌ని చూశాను. తొలి చూపులోనే నచ్చేశాడు. 'పిల్లా నువ్వులేని జీవితం' ప్రోమోస్ చూశాక నా సుబ్రమణ్యం ఇతనే అని ఫిక్స్ అయిపోయాను. సీత అనే పాత్రను రెజీనా చేస్తోంది. చాలా కొత్తగా ఉంటుందా పాత్ర. సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్‌తో తొలిసారి పనిచేస్తున్నాను. ప్రతిభావంతులైన టీమ్ పనిచేస్తున్న వినోదాత్మక ప్రేమకథ ఇది'' అని హరీశ్‌శంకర్ తెలిపారు.

సాయిధరమ్‌తేజ్‌. సుమన్‌, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావు రమేశ్‌, పృథ్వీ, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటించే ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే. మేయర్‌, ఫొటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, స్క్రీప్లే: రమేశ్‌రెడ్డి, సతీశ్‌ వేగేశ్న, తోట ప్రసాద్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌, నిర్మాత: దిల్‌ రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీశ్‌శంకర్‌ ఎస్‌

English summary
Sai Dharam Tej also gave green signal to star in the direction of Anil Ravipudi of ‘Pataas’ fame. Dil Raju is producing the film. According to the latest it is coming out that the film will be titled as Supreme. Film will be launched on Vijayadashami and will go to sets from November.
Please Wait while comments are loading...