Just In
- 8 min ago
చివరి నిమిషంలో లెక్కలు మార్చిన వకీల్ సాబ్.. ఒక్కసారిగా పెరిగిన రేటు.. మంచి. లాభమే!
- 56 min ago
బాక్సాఫీస్ ఫైట్: అల్లుడు అదుర్స్ vs రెడ్.. థియేటర్స్ కోసం గొడవలు.. చివరికి ఎంత రాబట్టారంటే?
- 1 hr ago
RED Movie Day 1 Collections: రికార్డు స్థాయిలో వసూల్ చేసిన రామ్.. ఫస్ట్ డే ఎంత రాబట్టాడంటే!
- 1 hr ago
అభిజీత్‌కు రోహిత్ శర్మ కానుక: ఏకంగా ఆస్ట్రేలియా నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన టీమిండియా క్రికెటర్!
Don't Miss!
- News
పార్లమెంట్ భేటీకి ముహూర్తం ఫిక్స్: బడ్జెట్ ఎప్పుడంటే?: పేపర్ లెస్..నిర్మలమ్మ స్పెషాలిటీస్
- Finance
విలువలేదు: బిట్ కాయిన్, టెస్లా జంప్‌పై రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు
- Sports
బిగ్‌బాస్ విన్నర్ అభిజీత్‌కు రోహిత్ శర్మ గిఫ్ట్!
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : అన్ని చింతలు మరిచిపోయి, ఈరోజు పూర్తిస్థాయిలో ఆస్వాదించాలి...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రభాస్‌తో సాయి పల్లవి రొమాన్స్ చేస్తే.. మరోసారి ఫిదా మ్యాజిక్?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా ఓకే చేసినా కూడా మినిమమ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే రూపొందుతుందని చాలా ఈజీగా అర్ధమవుతోంది. ప్రభాస్ తో సినిమా చేయాలి అంటే మినిమమ్ 200కోట్ల బడ్జెట్ అనేలా మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నారు. బడ్జెట్, క్యాస్టింగ్ విషయాల్లో కూడా అంచనాలకు తగ్గడం లేదు.

దాదాపు ఐదారేళ్ల వరకు బిజీగా ఉండేలా..
ప్రభాస్ లైనప్ ఇప్పుడు మామూలుగా లేదు. ఆయన ఒకే చేస్తున్న ప్రతి సినిమా కూడా అభిమానుల్లో అంచనాల డోస్ ను పెంచుతోంది. ఒక విధంగా ప్రభాస్ ఈ లాక్ డౌన్ ను చాలా బాగా ఉపయోగించుకున్నాడనే చెప్పాలి. దాదాపు ఐదారేళ్ల వరకు బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకున్నట్లు చాలా ఈజీగా అర్ధమయ్యింది. ప్రస్తుతం వరుసగా 4 సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.

అభిమానులకు నిరాష తప్పడం లేదు
మొదట ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా ఎలా ఉంటుందో గాని అంచనాలు అయితే అకాశాన్ని దాటేశాయి. అయితే అప్డేట్స్ ఇవ్వడంలో మాత్రం చిత్ర యూనిట్ అభిమానులను బాగా అప్సెట్ చేస్తోంది. ప్రభాస్ పుట్టినరోజుకు అయినా టీజర్ వస్తుందని అనుకున్నారు కానీ యూవీ క్రియేషన్స్ ఎప్పటిలానే స్లోగా వెలుతోంది.

అభిమానుల ఫోకస్ మొత్తం ఆ సినిమాపైనే..
ఇక ప్రస్తుతం ప్రభాస్ అభిమానుల ఫోకస్ మొత్తం KGF డైరెక్టర్ సలార్ సినిమాపైనే పడింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్ ఫిక్షన్ సినిమాతో పాటు ఆదిపురుష్ సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో కూడా సినిమా చేస్తున్నాడు అనగానే ఒక్కసారిగా అభిమానులు ఎగిరిగంతేశారు. ఇక ఆ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు గాని రూమర్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి.

మొదటిసారి సాయి పల్లవి
మొదటిసారి ప్రభాస్ సరసన సాయి పల్లవి నటిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాకు ఇద్దరు హీరోయిన్స్ ను అందుకున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల దిశా పటానిని ఫిక్స్ చేసినట్లుగా వార్తలు రాగా ఇప్పుడు సాయి పల్లవి కూడా ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తోంది.

ఫిదా కాంబినేషన్..
మంచి హైట్ ఉన్న హీరోలకు నిజంగా కొంచెం హైట్ తక్కువగా ఉన్న హీరోయిన్స్ జతకడితే ఆ కిక్కు మామూలుగా ఉండదు. ఇక ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ సరసన ఎంతో క్యూట్ గా కనిపించిన సాయి పల్లవి ఇప్పుడు ప్రభాస్ లాంటి హీరోతో జోడి కడితే మరింత అద్భుతంగా ఉంటుందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక డోస్ పెంచకుండా సలార్ సినిమాలో సాయి పల్లవి లవ్లీ రొమాన్స్ ఉండవచ్చని టాక్ వస్తోంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.