Sai Pallavi Kalki 2: కల్కి 2లో సాయి పల్లవి ఎంట్రీ.. రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్..
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో ఒకటి కల్కి 2898 AD. రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సైన్స్‌ఫిక్షన్ మిస్టికల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల గ్రాస్ వసూలు చేసి కొత్త చరిత్ర సృష్టించింది. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ₹180 కోట్లు, మొదటి వారంలో రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇలా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూలు చేసి, ఇండియాలో అత్యధిక వసూలు సాధించిన నాల్గవ అతిపెద్ద చిత్రంగా నిలిచింది. మహాభారత నేపథ్యంతో ఆధునిక సాంకేతికతతో కొత్త ప్రపంచాన్ని చూపించిన ఈ సినిమా, క్వాలిటీ, విజువల్ ప్రెజెంటేషన్‌తో ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది.
అంతటి విజయం సాధించిన ఈ మూవీకి సీక్వెల్‌గా కల్కి 2 రాబోతుంది. ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగ్ అశ్విన్ మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టగా, ప్రభాస్ మళ్లీ టైటిల్ రోల్‌లో నటించనున్నారు. ఈసారి కూడా స్టార్ క్యాస్ట్ పాన్ ఇండియా రేంజ్‌లో ఉండనుందని సమాచారం. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి లెజెండరీ నటులు కూడా ఈ సీక్వెల్‌లో భాగం కానున్నట్టు తెలుస్తోంది. అయితే కల్కి 2 లో హీరోయిన్ పాత్రపై పెద్ద చర్చ నడుస్తోంది.

కల్కి 2898 ఏడీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. అయితే.. సీక్వెల్ నుండి తప్పించినట్టు ఇటీవల వార్తలు బయటకొచ్చాయి. దీపికా యాటిట్యూడ్, ప్రొఫెషనల్ బిహేవియర్ కారణంగా మేకర్స్ ఆమెను ప్రాజెక్ట్ నుండి తప్పించారని టాక్. దీంతో ఆ పాత్రను ఎవరు చేయబోతారు అనే ఆసక్తి ఫిలిం సర్కిల్‌లో పెరిగింది. ఈ నేపథ్యంలో మొదట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్‌ను సంప్రదించినప్పటికీ, షెడ్యూల్ ఇష్యూస్ కారణంగా ఆమె అందుబాటులో లేకపోయింది.
ఆ తర్వాత కృతి సనన్, అనుష్క శెట్టి వంటి పేర్లు కూడా చర్చలోకి వచ్చాయి. అయితే ప్రభాస్ మాత్రం ఈ పాత్రకు సాయి పల్లవి మాత్రమే సరిపోతుందని సూచించాడట. ఆమె నేచురల్ పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ క్యారక్టర్‌కి కొత్త డైమెన్షన్ ఇస్తుందని ప్రభాస్ మేకర్స్‌కి సూచించాడని ఫిల్మ్ నగర్ టాక్. అందుకే కల్కి టీమ్ సాయి పల్లవిని సంప్రదించిందని, ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో చేరడానికి సాయి పల్లవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు ఈ న్యాచురల్ బ్యూటీ సినిమాలో భాగం కానున్నట్టు తెలుస్తోంది.
అలాగే.. కల్కి 2 లో సాయి పల్లవి భాగం కానున్న నేపథ్యంలో రెమ్యూనరేషన్ కూడా హట్ టాపిక్ గా మారింది. కల్కి 2 లో సాయి పల్లవి నటించడానికి రూ. 8 కోట్ల రికార్డు స్థాయి రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు సమాచారం. టాలీవుడ్‌లో ఇప్పటివరకు చాలా కొద్ది మంది హీరోయిన్‌లు మాత్రమే ఈ స్థాయి పారితోషికం తీసుకున్నారు. కల్కి 2 లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో భాగం కావడం సాయి పల్లవి కెరీర్‌లో ఒక మైలురాయిగా మారనుంది. ఇక సాయి పల్లవి ఈ ఆఫర్‌ను అంగీకరిస్తుందా లేదా అనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే, కల్కి 2 లో ప్రభాస్-సాయి పల్లవి కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్‌పై చూడటం సినీప్రియులకు ఒక విజువల్ ట్రీట్ కానుంది.


Click it and Unblock the Notifications











