కోటి రూపాయల ఆఫర్‌.. తిరస్కరించిన సాయి పల్లవి

ఢీ లేడీస్ స్పెషల్ ఎంతో పాపులరైన సంగతి తెలిసిందే. ఈ షో ద్వారానే సాయి పల్లవి వెలుగులోకి వచ్చింది. జార్జియాలో మెడిసిన్ చేసిన ఈ తమిళ కుట్టి మలయాళ చిత్రం 'ప్రేమమ్'ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో సాయి పల్లవి లుక్స్, నటకు కుర్రకారు ఫిదా అయ్యారు. ప్రేమమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేసినా.. సాయి పల్లవి పాత్రకు శ్రుతీ హాసన్‌ను తీసుకున్నారు.

అయితే అక్కడ వర్కౌట్ అయినట్టుగా ఇక్కడ కాలేదు. తెలుగు రీమేక్‌లో సాయి పల్లవిని చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు కలగలేదు. అయితే శేఖర్ కమ్ముల చేసిన మ్యాజిక్.. సాయి పల్లవిని ఇక్కడి ఆడియెన్స్‌కు దగ్గర చేసింది. ఫిదా చిత్రంలో తెలంగాణ అమ్మాయిల నటించి అందరినీ ఆకట్టుకుంది.

 భయపడుతున్న హీరోలు..

భయపడుతున్న హీరోలు..

నటనకు ప్రాముఖ్యత వున్న పాత్రల్లో మాత్రమే నటిస్తున్న సాయి పల్లవి అంటే హీరోలు ఒకింత భయపడుతున్నారని టాక్. ఎక్కడ తమని డామినేట్ చేస్తుందోనని తనతో కలిసి నటించడానికి జంకుతుండడం ఇటీవల ఫిలింసర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాని, శర్వానంద్ వంటి నటులే సాయి పల్లవి ముందు సరిపోలేదని అప్పట్లో ఓ రూమర్ కూడా వచ్చింది. తెరపై సాయి పల్లవి చేసే మ్యాజిక్ అలాంటిది మరి అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

 యాడ్స్‌లో నటించని సాయి పల్లవి

యాడ్స్‌లో నటించని సాయి పల్లవి

హీరోయిన్లు తమకు వచ్చిన ఫేమ్‌ను ఉపయోగించుకుని డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నట్టు.. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్‌ను నమ్ముతారు. కానీ సాయి పల్లవి మాత్రం ఇందుకు భిన్నం. ఎంతటి ఆఫర్ వచ్చినా టెంప్ట్ కాకుండా తిరస్కరిస్తూ వస్తోంది.

గతంలో రెండు కోట్ల ఆఫర్

గతంలో రెండు కోట్ల ఆఫర్

గతంలో ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ నటించేందుకు రెండు కోట్ల ఆఫర్‌ను కాదనుకుందని వార్తలు వినిపించాయి. అందమనేది సహజంగా ఉండాలి.. అలాంటి ఉత్పత్తులను వాడమని తాను చెప్పలేనని అందుకే యాడ్స్‌లో నటించనని ఓ చోట చెప్పుకొచ్చింది.

తాజాగా మరో ఆఫర్‌ను..

తాజాగా మరో ఆఫర్‌ను..

తాజాగా మరో బిగ్ డీల్ ని ఫిదా బ్యూటీ కాదనుకుందట. వేరొక పెద్ద కార్పొరెట్ సంస్థ తన ఉత్పత్తుల కోసం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకునేందుకు సాయి పల్లవికి కోటి రూపాయలు ఆఫర్ చేసిందట. అయితే ఎప్పటిలాగే ఈ ఆఫర్ ని కూడా సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

Recommended Video

#CineBox : Sarileru Nekevvaru Teaser Update | Aamir Khan's Lal Singh Chadha First look
వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ..

వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ..

ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న `విరాటపర్వం` చిత్రంతో పాటు నాగ చైతన్య హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తోంది. అంతేకాకుండా వెబ్ సిరీస్‌లోనూ నటించేందుకు అంగీకరించినట్టు టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా సాయి పల్లవి వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూనే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X