»   » చిరు సినిమాకి ఆ పేరు మార్చాల్సిందే :ఉయ్యాలవాడ వారసుల ఆగ్రహం?

చిరు సినిమాకి ఆ పేరు మార్చాల్సిందే :ఉయ్యాలవాడ వారసుల ఆగ్రహం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి 151వ చిత్రం 'సైరా'-నరసింహారెడ్డి పేరు అధికారికంగా విడుదలైన నిమిషాల వ్యవధిలోనే ఓ వివాదం మొదలైంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో చిత్రం తీస్తూ, ఆయన పేరును పెట్టకుండా 'సైరా' అనే పేరును విడుదల చేయడంపై ఉయ్యాలవాడ వంశస్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఉయ్యాలవాడ వారసులు

ఉయ్యాలవాడ వారసులు

చిత్రం టైటిల్ పై తమకు అభ్యంతరాలు ఉన్నాయని, దీనిపై ఫిర్యాదు చేస్తామని రాయలసీమలో ఇప్పటికీ ఉన్న ఉయ్యాలవాడ వారసులు వ్యాఖ్యానించారు. వెంటనే చిత్ర టైటిల్ ను మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై మరింత సమాచారం వెలువడాల్సి వుంది.


టైటిల్‌ పోస్టర్‌

టైటిల్‌ పోస్టర్‌

చిరు బర్త్ డే సందర్భంగా ఇవాళ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ను, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన లోగోను డైరెక్టర్ రాజమౌళి విడుదల చేశారు.అయితే ఇదివరకు అనుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రెడ్డి కాకుండా సినిమా పేరు మార్చి.. 'సైరా' టైటిల్‌ను సినిమా యూనిట్‌ ఖరారు చేసింది.


పేరు మార్చడంపై

సినిమా పేరు మార్చడంపై ఉయ్యాలవాడ వారుసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదం పై ఇంకా స్పష్టమైన వివరాలు ఇంకా బయటికి మాత్రం రాలేదు. అయితే ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారన్నది ఇప్పుడు సైరా టీమ్ ముందు ఉన్న ప్రశ్న. టైటిల్ కూడా అభిమానులకి నచ్చేలాగా ఉండటం తో మళ్ళీ మార్పు ఉండకపోవచ్చన్నదే అందరి అభిప్రాయం అన్న వార్తలూ వస్తున్నాయి.


న‌టీన‌టుల వివ‌రాలు

న‌టీన‌టుల వివ‌రాలు

ఈ సినిమాలో న‌టిస్తున్న న‌టీన‌టుల వివ‌రాలు కూడా అధికారికంగా తెలిశాయి. ఇందులో చిరంజీవి స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టిస్తుండ‌గా, అమితాబ్ బ‌చ్చ‌న్‌, సుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు, త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ఇత‌ర పాత్ర‌లు పోషిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దేశభక్తుని జీవితగాథతో ఈ మూవీ తెరకెక్కబోతోంది. 'సైరా నరసింహారెడ్డి' సినిమాకు నిర్మాతగా రాంచరణ్, సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. ఏఆర్ రెహ్మాన్‌ బాణీలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది.English summary
As per the Latest Report Uyyalawada Narasimha Reddy family members opposinig the New Titil "Saira" for Megastar new Movie on uyyalawada Narasimhareddy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu