»   »  2016లో ప్రేయసితో కండల వీరుడు సల్మాన్ పెళ్లి?

2016లో ప్రేయసితో కండల వీరుడు సల్మాన్ పెళ్లి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: హిట్ అండ్ రన్ కేసు నుంచి విముక్తి లభించడంతో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ రొమేనియా టీవీ యాంకర్ ఇలియా వ్యాంటర్‌ను పెళ్లాండేందుకు లైన్ క్లియర్ అయిందనే ప్రచారం ఇంటర్నెట్‌లో జరుగుతున్నది.

2016లో పెండ్లి చేసుకొనేందుకు సల్మాన్ ఓకే చెప్పినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. తల్లిదండ్రులు పెండ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా.. ఒకవేళ కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే భార్యకు ఏం సమాధానం చెప్పుకోవాలి?, నా గురించి అడిగితే పిల్లలకు ఆమె ఏమని చెప్తుం ది?, నీ తండ్రి జైల్లో ఉన్నాడని చెప్పడం బాగుంటుందా? అని సల్మాన్ వాపోయేవాడని ఆంగ్ల దినపత్రిక రాసింది.

 Salman Khan and Iulia Vantur getting married in 2016?

కోర్టు తీర్పు సానుకూలంగా వస్తే పెండ్లి గురించి ఆలోచిస్తానని ఇటీవల టీవీ ఇంటర్వ్యూలో సల్మాన్ చెప్పడాన్ని కథనంలో ప్రస్తావించింది. గతంలో సల్మాన్ నిశ్చితార్థం వార్తలను ఖండించిన కుటుంబసభ్యులు.. ఈ వార్తలపై ఎలాంటి ప్రకటన చేయడంలేదు.

English summary
Salman Khan might finally be tying the knot in early 2016. With whom, you ask? Iulia Vantur is the answer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu