»   » 'తనీఒరువన్' రీమేక్ ఆగినట్లే..రామ్ చరణ్ ఏమంటాడో

'తనీఒరువన్' రీమేక్ ఆగినట్లే..రామ్ చరణ్ ఏమంటాడో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గత కొద్ది రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా నలుగుతున్న విషయం 'తనీఒరువన్' రీమేక్. రామ్ చరణ్ హీరోగా తెలుగులో సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. అలాగే సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలోనూ రీమేక్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం.. హిందీ రీమేక్ ఆగిపోయినట్లే అని తెలుస్తోంది.

రామ్ చరణ్ చేస్తున్న రీమేక్ కావటంతో ఆయన స్నేహితుడు అయిన సల్మాన్ వెంటనే ఈ సినిమాపై దృష్టి పెట్టారు. అయితే కాలక్రమేణా.. ఈ రీమేక్ పై సల్మాన్ పెద్దగా ఇంట్రస్ట్ చూపించకపోవటంతో ఆగిపోయిందని చెప్తున్నారు.తమిళ్ లో తనిఒరువన్ సినిమాకు దర్శకత్వం వహించిన మోహన్ రాజా తన దర్శకత్వంలోనే హిందీలో తెరకెక్కించాలనుకున్నాడు. ఆ మేరకు టాక్స్ కూడా జరిగాయి.

Salman Khan not starring in 'Thani Oruvan' remake

సల్మాన్ కాదనటానికి కారణం... ముఖ్యంగా కథలో ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవటమే అంటున్నారు. అంతేకాదు... ఇప్పట్లో సల్మాన్ డేట్స్ కూడా ఖాళీ లేకపోవటంతో ఈ రీమేక్ ఆగిపోయిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి రామ్ చరణ్ ...ఈ విషయమై ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో అంటున్నారు సినీ జనం.

సల్మాన్ వంటి స్టార్ హీరో వద్దనుకున్నాక..మరింత జాగ్రత్తగా ఈ సినిమాని డీల్ చేయాల్సిన అవసరం ఉందని రామ్ చరణ్ ఫిక్స్ అయ్యాడంటున్నారు. సురేంద్రరెడ్డికి ఈ విషయమై ప్రత్యేకమైన సూచనలు చేసి, ఎంటర్టైన్మెంట్ పాళ్లు పెంచి ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలని డెశిషన్ తీసుకున్నాడంటున్నారు.

Salman Khan not starring in 'Thani Oruvan' remake

ఇక ఈ రీమేక్ ఆగిపోయిన విషయాన్ని స్వయంగా చెప్పకపోయినా, త్వరలోనే వేరే సినిమా మొదలవుతుందంటూ దర్శకుడు మోహన్ రాజా ప్రకటించటంతో తనీఒరువన్ బాలీవుడ్ రీమేక్ ఆగిపోయిన విషయం ఖరారు అయినట్లైంది.

English summary
Salman Khan, who was supposed to star in the remake of Tamil blockbuster "Thani Oruvan", will reportedly not take up the project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu