twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శేఖర్ కమ్ముల దర్శకత్వంలో...సల్మాన్ ఖాన్ నిర్మాతగా

    By Srikanya
    |

    ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిర్మాతగా తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఆ చిత్రం మరేదో కాదు 'హ్యాపీడేస్‌' రీమేక్. ప్రస్తుతం 'అనామిక' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు శేఖర్‌కమ్ముల. దీని తరవాత ఆయన 'హ్యాపీడేస్‌' ప్రాజెక్ట్‌ చేపట్టే అవకాశాలున్నాయి. ఈ చిత్రం కోసం ముంబైలో ఓ స్టార్‌హంట్‌ని నిర్వహించి, నూతన నటీనటుల్ని ఎంచుకొంటారట.

    స్నేహంలోని మాధుర్యం, కాలేజీ ప్రేమాయణం, అలకలు, సరదాలూ, చిలిపి తగాదాలూ ఇవన్నీ కలిపి 'హ్యాపీడేస్‌' అంటూ రంగరించారు శేఖర్‌కమ్ముల. యువతరానికే కాదు, ఇంటిల్లిపాదికీ ఈ చిత్రం బాగా నచ్చింది. చిన్న సినిమాలకూ, కాలేజీ కథలకు కొత్త ఊపిరిపోసింది. ఇదే చిత్రాన్ని తమిళంలో పునర్నిర్మించారు. ఇప్పుడు హిందీలోకీ తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 'హ్యాపీడేస్‌'ని బాలీవుడ్‌లోనూ రీమేక్‌ చేయాలన్న బిజీలో ఉన్నారు శేఖర్‌ కమ్ముల.

    Salman khan to produce hindi remake of Happy Days

    ఇక నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'అనామిక'. హిందీలో విజయవంతమైన 'కహానీ' సినిమా ఆధారంగా రూపొందుతోంది. అక్కడ విద్యాబాలన్‌ పోషించిన పాత్రలో ఇక్కడ నయనతార నటిస్తోంది. వైభవ్‌, హర్షవర్ధన్‌ రాణే కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఎండమోల్‌ ఇండియా, లాంగ్‌లైన్‌ ప్రొడక్షన్స్‌, సెలెక్ట్‌ మీడియా హోల్డింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం సెన్సార్ ఇప్పటికే పూర్తైంది. 'U/A'సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం ఏప్రియల్ 18న కానీ, 25న కానీ థియోటర్స్ వెసులుబాటుని బట్టి విడుదల చేయటానికి నిర్ణయించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

    నయనతార మాట్లాడుతూ ''స్త్రీ ప్రాధాన్యమున్న సినిమాలో నటించడం చాలా ఆనందాన్నిస్తోంది. అనామికగా కొత్త నయనతారని చూస్తారు. కహాని' సినిమాలో చాలా మార్పులు చేశారు. నా పాత్ర తీరుతెన్నులు కూడా మారాయి. నా శైలిలోనే నటించాను. ఎంత రీమేక్‌ అయినా మార్పులు, చేర్పులూ అవసరం. మక్కీకి మక్కీ తీస్తే చూడ్డానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఒక వేళ అలాంటి కథలే నాముందుకు వస్తే అంగీకరించను. శేఖర్‌ శైలి తెలుసు కాబట్టి, ఆయన మార్పులు నచ్చాయి కాబట్టి 'కహాని' ఒప్పుకున్నా'' అన్నారు.

    అలాగే...నా దృష్టిలో ఇదొక ప్రత్యేకమైన చిత్రం. 'కహానీ' ఆధారంగా రూపొందుతున్న చిత్రమే అయినా... రెండింటిమధ్య ఏమాత్రం పోలికలు కనిపించవు. మన వాతావరణానికి తగ్గట్టుగా కథలో పూర్తిస్థాయిలో మార్పులు చేశారు శేఖర్‌ కమ్ముల. విద్యాబాలన్‌ పోషించిన పాత్రతో నా పాత్రని ఎవ్వరూ పోల్చి చూసుకోలేరు. అంత వైవిధ్యంగా ఉంటుంది. అందరినీ ఆకట్టుకొనే ఓ మంచి చిత్రమవుతుంది అంటూ నయనతార చెప్పుకొచ్చింది.

    శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ''భర్తను వెతుక్కొంటూ ఓ యువతి హైదరాబాద్‌ నగరంలో చేసిన పోరాటమే ఈ సినిమా. ఆమె ప్రయత్నం ఫలించిందా లేదా అనేది కీలకాంశం. 'కహానీ' కథకు పలు మార్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. ''అన్నారు. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. కీరవాణితో పని చేయడం శేఖర్‌కి ఇదే ప్రథమం. అనామిక చిత్రీకరణ హైదరాబాద్‌ పరిసరాల్లో సాగుతోంది. ఈ చిత్రంలో వైభవ్‌ పోలీసు కానిస్టేబుల్‌ పాత్రను పోషిస్తున్నారు. ఈ కథలో కీలకమైన పాత్ర ఇది.

    ''పెళ్త్లెన ఓ మహిళ నేపథ్యంలో సాగే కథ ఇది. ఆమె ఎవరి కోసం అన్వేషణ ప్రారంభించింది? జీవితంలో ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొంది? అనే విషయాలు ఆసక్తికరం. ఎం.ఎం.కీరవాణి స్వరాలు చిత్రానికి బలాన్నిస్తాయి''అని నిర్మాత చెబుతున్నాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విజయ్‌ సి.కుమార్‌.

    English summary
    Salman Khan seems to have taken film production as a serious venture. It was earlier speculated that the 47-year-old has bought the rights to a blockbuster Telugu movie ‘’Happy days’’ directed by Shekar Kammula.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X