»   » చాలా మంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చి ఫైయిల్ అయినాను: సల్మాన్ ఖాన్

చాలా మంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చి ఫైయిల్ అయినాను: సల్మాన్ ఖాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కి ఆర్థికంగా ఇబ్బందులున్నాయట..అవీ నిన్నటిదాకానే..'దబాంగ్" సినిమాకి ముందు ఆర్థికంగా తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని వాపోతున్నాడు సల్మాన్ ఖాన్. చాలామంది హీరోయిన్లకు తాను లైఫ్ ఇచ్చాననీ, వారి కోసం తాను కోట్లకు కోట్లు ఖర్చుపెట్టాననీ, అయితే అలా తనచేత డబ్బు ఖర్చు పెట్టించినవారంతా తనకు హ్యాండిచ్చారే తప్ప, తనను కనీసం మనసికంగా ఎవరూ ఓదార్చలేకపోయారని సల్మాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

'దబాంగ్" సక్సెస్ తనను మానసికంగా, ఆర్థికంగా కోలుకునేలా చేసిందనీ, చాలా గుణపాఠాలు నేర్చుకున్నాననీ సల్మాన్ చెబెతున్నాడు. అన్నట్టు, 'దబాంగ్" సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో 'దబాంగ్" సినిమాకి ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అందిన రెమ్యునరేషన్ తో పాటు, మరో పది కోట్లు సల్మాన్ ఖాన్ అదనంగా పొందాడని బాలీవుడ్ జనం చెవులు కొరుక్కంటున్నారు.

'దబాంగ్" హిట్ కావడంతో, బ్రాండ్ అంబాసిడర్ గా తమ ప్రోడక్ట్స్ కి పనిచేయాలంటూ వివిధ సంస్థలనుంచి సల్మాన్ ఖాన్ కి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట. ఓ అంచనా ప్రకారం, 'దబాంగ్"సినిమా తర్వాత సల్మాన్ ఖాన్ ఏకంగా రెండొందల కోట్ల రూపాయల 'కమర్షియల్" ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu