For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సమంత సంచలన నిర్ణయం: సినిమాలను తగ్గించి దానిపై దృష్టి.. అందరికీ సొంతం అయ్యాలా ప్లాన్

  |

  చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా సత్తా చాటుతోంది అక్కినేని వారి కోడలు సమంత. అదిరిపోయే గ్లామర్‌తో పాటు అద్భుతమైన యాక్టింగ్‌తో దాదాపు పదేళ్లుగా సినీ రంగంలో హవాను చూపిస్తోన్న ఈ బ్యూటీ.. ఇటీవలే డిజిటల్ వరల్డ్‌లోనూ తన స్టామినాను చూపించింది. దీంతో దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకోవడంతో పాటు భారీ ఆఫర్లను ఒడిసి పట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత ఓ సంచలన నిర్ణయం తీసుకుందని ఒక న్యూస్ ఫిలిం నగర్‌లో తెగ వైరల్ అవుతోంది. అసలేంటా నిర్ణయం? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  రెండు భాషల్లో హవా.. వరుస సినిమాలు

  రెండు భాషల్లో హవా.. వరుస సినిమాలు

  సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తూ దూసుకుపోతోంది స్టార్ హీరోయిన్ సమంత. ఇక, ఈ మధ్య కాలంలోనైతే ఆమె ఓ రేంజ్‌ ఫామ్‌లో కొనసాగుతోంది. దీంతో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ సత్తా చాటుతోంది. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ వరుస విజయాలను అందుకుంటోంది. ఫలితంగా రెండు భాషల్లోనూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది.

   అందులోకి కూడా అడుగు పెట్టిన బ్యూటీ

  అందులోకి కూడా అడుగు పెట్టిన బ్యూటీ

  చాలా ఏళ్లుగా వెండితరపై హవాను చూపిస్తూ ముందుకెళ్తోన్న సమంత.. ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ వరల్డ్‌లోకి అడుగు పెట్టింది. దీన్ని తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో సామ్ నెగెటివ్ పాత్రలో నటించింది. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఈ స్టార్ హీరోయిన్‌కు ఘనమైన ఆరంభం దక్కినట్లైంది.

  స్పెషల్ అట్రాక్షన్‌గా సమంత.. ట్రెండింగ్‌గా

  స్పెషల్ అట్రాక్షన్‌గా సమంత.. ట్రెండింగ్‌గా

  ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో మనోజ్ భాజ్‌పేయ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించినప్పటికీ.. సమంత పాత్ర స్పెషల్ అట్రాక్షన్ అయింది. మరీ ముఖ్యంగా ఆమె చేసిన రాజీ అనే రోల్‌కు ప్రశంసలు దక్కాయి. తొలిసారి బోల్డుగా, నెగెటివ్ షేడ్స్‌తో చేసినప్పటికీ సమంత అద్భుతంగా నటించింది. దీంతో ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఫలితంగా సామ్ పేరు ట్రెండ్ అయింది.

   లేడీ ఓరియెంటెడ్ సినిమాలో టైటిల్ రోల్

  లేడీ ఓరియెంటెడ్ సినిమాలో టైటిల్ రోల్

  నిన్న మొన్నటి వరకూ సమంత వరుస సినిమాలను ఒప్పుకుంటూ వచ్చేది. అయితే, ఈ మధ్య ఆమె పెద్దగా ప్రాజెక్టులను చేయడం లేదు. ఈ నేపథ్యంలో భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘శాకుంతలం' అనే పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తున్నట్లు వెల్లడించింది. ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు.

   సంచలన నిర్ణయం తీసుకున్న సమంత

  సంచలన నిర్ణయం తీసుకున్న సమంత

  ప్రస్తుతానికి సమంత ‘శాకుంతలం' మూవీతో పాటు ఓ తమిళ చిత్రంలో నయనతారతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. వీటి తర్వాత ఆమె సినిమాలు చేస్తుందా? లేదా అన్న దానిపైనా కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో మరో వెబ్ సిరీస్‌ కూడా చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సామ్ ఓ సంచలన నిర్ణయం తీసుకుందని న్యూస్ లీకైంది.

   సినిమాలను తగ్గించేసి.. దానిపైనే ఫోకస్

  సినిమాలను తగ్గించేసి.. దానిపైనే ఫోకస్

  అక్కినేని వారి కోడలు సమంత బిజినెస్ చేయబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ‘సాకీ' పేరిట ఓ బట్టల వ్యాపారానికి సిద్ధ పడిన ఆమె.. ఇప్పుడు గోల్డ్ బిజినెస్‌ను మొదలు పెట్టబోతుందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్, ప్లానింగ్ జరుగుతుందని.. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రాబోతుందని అన్నపూర్ణ స్టూడియో వర్గాల నుంచి వెల్లడైంది.

  The Family Man 2 Review | Samantha, Screenplay రెండూ సూపర్ !! || Filmibeat Telugu
  అందరూ సొంతం చేసుకోవాలన్న లక్ష్యం

  అందరూ సొంతం చేసుకోవాలన్న లక్ష్యం

  ఎంతో ఖర్చుతో కూడుకున్న బంగారాన్ని సామాన్య ప్రజలందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో సమంత ఈ బిజినెస్‌ను ప్రారంభించబోతుందట. అన్ని స్టోర్స్ కంటే తక్కవ ధరలకు ఆభరణాలను అమ్మడానికే ఈ వ్యాపారాన్ని చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట దీనిని హైదరాబాద్‌లో ప్రారంభించి.. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలతో తమిళనాడుకు కూడా విస్తరించాలని ప్లాన్ చేసిందట సామ్.

  English summary
  Tollywood Star Heroine Samantha Akkineni Plan to Start a Gold Business with Very Low Price. This Official Announcement Coming Soon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X