For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జూ.ఎన్టీఆర్ జోడి కోసం సమంత పెంచేసింది

  By Srikanya
  |

  హైదరాబాద్ : సమంత,ఎన్టీఆర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ హరీష్ శంకర్ ఓ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం నిమిత్తం సమంత భారీగానే వసూలు చేస్తున్నట్లు సమాచారం. కోటిన్నర ఆమె తీసుకుంటోం దని సమాచారం. ఆమె డిమాండ్ రోజు రోజుకి పెరిగిపోవటంతో ఆ రేంజిలో రెమ్యునేషన్ పెంచినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సురేష్ తదుపరి చిత్రం లో కూడా ఆమెనే తీసుకున్నారు. ఇద్దరి సినిమాల్లోనూ ఎన్టీఆర్ హీరో,అలాగే ఇద్దరూ సమంతనే జంటగా కోరుకోవటం విశేషం. సమంత,ఎన్టీఆర్ కాంబినేషన్ లో గతంలో బృందావనం చిత్రం వచ్చి హిట్టైంది.

  అయితే ఆమె రెమ్యునేషన్ పెంచటం నిజం కాదని ఆమె సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్టీఆర్ తో రెండు చిత్రాలు చేయటం వరకూ నిజమే కానీ..రెమ్యేనేషన్ పెంచటం మాత్రం కేవలం రూమర్ అని కొట్టిపారేస్తున్నారు. అసలు ఇలాంటి రూమర్స్ ఎవరు పుట్టిస్తారో అని ఆమె ఆశ్చర్యపోతోందని అన్నారు. అయితే డిమాండ్ ఉన్నప్పుడు రేటు పెంచటం వింతైన విషయమూ కాదు..తప్పూ కాదు..ఆమె పెంచకపోయినా నిర్మాతలైనా తమ డేట్స్ కోసమైనా పెంచుతారని పరిశ్రమలోని సీనియర్స్ అంటున్నారు.

  ఆ మధ్యన సమంతకు హెల్త్ బాగోకపోవటంతో కొన్ని నెలలు పాటు షూటింగ్ లకు దూరమైంది. ఈ విషయం గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ తనకు వచ్చిన అనారోగ్యం మేలే చేసిందని చెప్తోంది. ఆమె మాటల్లోనే...కొన్ని నెలలు షూటింగ్‌లకు దూరమవటం...అనారోగ్యం వల్ల తప్పలేదు. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడంతో ఆరోగ్యపరమైన కొన్ని సమస్యలు వచ్చాయి. అందుకే కాస్త విరామం తీసుకున్నాను. అయినా అనారోగ్యం మంచే చేసింది అంది.

  తాజా రిలీజ్ చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు' గురించి చెప్తూ... నా నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర. నిత్య అనే యువతిగా కనిపిస్తాను. ఈ కథ విన్న వెంటనే నచ్చింది. కానీ నేను చేయగలనా అనే ఆలోచన కూడా మొదలైంది. ఓ మంచి పాత్రకు న్యాయం చేయాలని చాలా కష్టపడ్డాను. 'ఏ మాయ చేసావె'లో జెస్సీలాగే నిత్య కూడా గుర్తుండిపోతుంది అంది.

  'ఎటో వెళ్లిపోయింది మనసు' లో ప్రేమ కథ మూడు దశలుగా ఉంటుంది. .. స్కూల్‌ దశలో ఆలోచనలు ఎలా ఉంటాయి?.. అవి కళాశాల స్థాయికి వెళ్లాక ఏ రీతిన మారతాయి?.. ఆపైన మానసిక పరిపక్వతతో ఏం చేస్తారు?.. అనే అంశాల్ని చూపించారు. ఆ దశలను పాత్రలో ప్రతిఫలింపజేయడం క్లిష్టమైన ప్రక్రియే. దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ సూచనలకు తగ్గట్టు నటించాను అని చెప్పింది.

  English summary
  According to reports, Samantha is being paid a biggest amount of money as remuneration to act in young tiger Junior NTR's upcoming movie. Now, reports suggest that she is offered a package of Rs 1.25 crore, which is next to that of Ileana D'Cruz, who charged Rs 1.5 crore for Snehithudu. Her remuneration suddenly got increased after producers Dil Raju and Bellamkonda Suresh vied for her dates. It is reported that Dil Raju and Bellamkonda Suresh are producing two different movies with Junior NTR and both the producers approached her to act opposite the same hero. But Samantha has reportedly accepted the offer of Bellamkonda Suresh, who has agreed to pay Rs 1.25 crore for his much-hyped project.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X