»   » పెళ్లికు ముందు ఒప్పుకోదనుకుంటే, సమంత సై అందే

పెళ్లికు ముందు ఒప్పుకోదనుకుంటే, సమంత సై అందే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రేమలో ఉన్న నాగ చైతన్య, సమంత త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఆమె హీరోయిన్ గా ఏ సినిమా కమిటవ్వటం లేదు. దాంతో వివాహం అయ్యి, ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ వస్తుందని అంతా భావించారు. అయితే ఇప్పుడామె సినిమా కమిటైందని సమాచారం.

రామ్ చరణ్ - సమంతను జంటగా చూడాలని ఉంది. ఈ కాంబినేషన్ లో సినిమా రావడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది..? అని గతంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులుగా మీ టూ అంటూ రిప్లై ఇచ్చింది సమంత. ఆ వెయిటింగ్ పూర్తి అయ్యి...చరణ్ ప్రక్కన ఛాన్స్ వచ్చింది సమంతకు.

Samantha has signed her next film opposite Ram Charan Teja?

రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు షురూ అయ్యాయి. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ రెండు బాణీల్ని కూడా సిద్ధం చేశారు.

మరోపక్క చెర్రీ సరసన నటించే హీరోయిన్ కోసం సుకుమార్‌ పెద్దయెత్తున కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. పలువురు ప్రముఖ హీరోయిన్స్ తో ఆడిషన్స్‌ కూడా నిర్వహించినట్టు సమాచారం. ఆ క్రమంలో చరణ్‌ సరసన నటించే హీరోయిన్స్ గా నిత్యమేనన్‌, రాశీ ఖన్నా పేర్లు వినిపించాయి.

ఇప్పుడు సమంత పేరు వినిపిస్తోంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో ఒక కొత్త జోడీని చూపిస్తేనే బాగుంటుందనేది సుకుమార్‌ ఆలోచన. ఆ మేరకే హీరోయిన్ ని ఎంపిక చేసుకోనున్నట్టు తెలుస్తోంది.

Samantha has signed her next film opposite Ram Charan Teja?

ఈ ఏడాది జనవరిలో 'నాన్నకు ప్రేమతో' అంటూ ఓ స్టైలిష్ రివెంజ్ డ్రామాతో హిట్ కొట్టిన సుకుమార్, ఈసారి రామ్ చరణ్‌తో విలేజ్ డ్రామాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇక ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా సుకుమార్ త్వరత్వరగా పూర్తి చేస్తున్నారు.

ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం ట్యూన్స్ సమకూర్చే పనిలో ఉన్నారట. ఇప్పటికే రెండు ట్యూన్స్ రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది. సుకుమార్-దేవిశ్రీల కాంబినేషన్‌లో ఇప్పటివరకూ వచ్చిన అన్ని బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్‌లానే ఈ ఆల్బమ్ కూడా ఉంటుందట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా భారీ ఎత్తున నిర్మించనున్నారు.

English summary
Reports suggest that Samantha is teaming up with Ram Charan Teja. Under Sukumar’s direction, the film is said to be a village-based romantic entertainer, which will be shot from January next year. However, an official confirmation is awaited in this regard.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu