»   » బ్రహ్మానందంని సమంత అవమానం చేసినట్లా?

బ్రహ్మానందంని సమంత అవమానం చేసినట్లా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఏ మాయ చేసావె' చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంతా..తనని అవమానం చేసిందని బ్రహ్మానందం ఫీలవతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం బ్రహ్మానందం తన కుమారుడు గౌతమ్ ని ప్రమోట్ చేసే క్రమంలో అతని ప్రక్కన సమంతను హీరోయిన్ గా అయితే బావుంటుందని, క్రేజ్ వస్తుందని భావించారుట. అందుకు తగినట్లే సమంతకు తన సర్కిల్ ద్వారా రికమెండ్ చేయంచాడు. అయితే అనుకోని విధంగా ఆమె ఆ ఆఫర్ ని రిజెక్టు చేసింది. ఆమె ఎదుగుతున్న క్రమంలో గౌతమ్ ప్రక్కన సరైన పని కాదని భావించి ఇండైరక్ట్ గా అదే విషయాన్ని డేట్స్ ఎడ్జెస్ట్ కాలేవంటూ చెప్పిందిట. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మానందం అవమానం ఫీలై భాదపడ్డారని వినిపిస్తోంది. ఇక బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ ప్రస్తుతం 'వారెవా...' అనే చిత్రంలో హీరోగా చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శాంభవి హీరోయిన్ గా, కళ్యాణ్‌ మంతెన దర్శకునిగా పరిచయమవుతున్నారు..అక్టోబరు 8న చిత్రం విడుదల అవునుంది. ఇంతకు ముందు సుచిత్రా చంద్రబోస్ దర్శకత్వంలో గౌతమ్ పల్లకీలో పెళ్ళికూతురు అనే చిత్రంలో చేసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu