»   » సమంత ఎగ్జిట్...రకుల్ ప్రీతి సింగ్ ఎంట్రీ

సమంత ఎగ్జిట్...రకుల్ ప్రీతి సింగ్ ఎంట్రీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమంత ని తమ సినిమాలో తీసుకోవాలని ప్రతీ దర్శక,నిర్మాత భావిస్తారు. అలాగే శ్రీను వైట్ల తన సినిమాలో సమంతను మరోసారి తీసుకుని దూకుడు లాంటి హిట్ ని సొంతం చేసుకోవాలనుకున్నారు. అదీ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం కోసం. అయితే అనుకోని విధంగా సీన్ లోకి రకుల్ ప్రీతి సింగ్ వచ్చి చేరింది. సమంత డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవటమే ఈ మార్పుకు కారణం అంటున్నారు. ఆమె ధనుష్ చిత్రానికి కంటిన్యూ డేట్స్ ఇవ్వటంతో రామ్ చరణ్ చిత్రానికి నో చెప్పాల్సి వచ్చిందంటున్నారు. అయితే రామ్ చరణ్ వంటి స్టార్ హీరో ప్రక్కన ఛాన్స్ పోవటం బాధకరమే అంటోందిట.

ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ సరసన...త్రివిక్రమ్ దర్సకత్వంలో రూపొందున్న చిత్రంలో చేస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సమంత లక్కీగాళ్‌ అని పేరు తెచ్చుకొన్నప్పటికీ... అప్పుడప్పుడు ఆమెనీ పరాజయాలు పలకరిస్తుంటాయి. ఆ ఫలితాలు తనపైన, తన నటనపైనా అసలేమాత్రం ప్రభావం చూపలేవని చెబుతోందీ చెన్నై సోయగం. అందుకే వెంటనే మళ్లీ విజయాలు సొంతం చేసుకోగలుగుతున్నా అంటోంది.

Samantha loses out Charan to Rakul

అసలు జయాపజయాల్ని మీరెలా తీసుకొంటుంటారు అనడిగితే ''మనం చిత్తశుద్ధితో పని చేస్తున్నంతవరకు ఫలితాల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదనేది నా అభిప్రాయం. తొలిరోజు నుంచి వృత్తి విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నా. భయభక్తులతో పనిచేస్తున్నా. నటిగా భవిష్యత్తు గురించీ ఆలోచిస్తున్నా. ఆ ముందు చూపు ఎక్కువగా ఉంది కాబట్టే నేను ఈ స్థాయిలో ఉన్నానని నమ్ముతుంటా.

ఎప్పుడైనా మన పనితీరు ముఖ్యం.. ఫలితం కాదు. నా సినిమా సరిగ్గా ఆడక పోయినా సమంత ఏంటనేది ప్రేక్షకులకు తెలుస్తుంది కదా? అలాంటప్పుడు ఎందుకు భయపడాలి! పరాజయాల ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలిసొస్తాయని నాకు ఇటీవలే అనుభవమైంద''ని సెలవిచ్చింది సమంత. ప్రస్తుతం ఆమె తెలుగులో అల్లు అర్జున్‌ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.

ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే... ఆమె తెలుగు,తమిళ భాషల్లో బిజీగా ఉంది. అయితే బాలీవుడ్ కి వెళ్లాలని ఆమె అబిమానులు కోరుకుంటున్నారు.
దక్షిణాదిన కొన్ని విజయాలు చేతికి అందగానే ఇక అందరి దృష్టి బాలీవుడ్‌పై పడుతుంది. అక్కడ కూడా నిరూపించుకోవాలన్న తపన మొదలవుతుంది. అయితే సమంతకు అలాంటి ఆలోచనలేం లేదని స్పష్టం చేస్తోంది.

Samantha loses out Charan to Rakul

ఈ విషయమై ఆమె మాట్లాడుతూ...''నా దగ్గర కూడా కోరికల జాబితా చాలానే ఉంది. మంచి సినిమాలు చేయాలి, మరింత పేరు తెచ్చుకోవాలని ఉంది. అయితే ఈ జాబితాలో హిందీ సినిమా చేయాలన్న కోరిక లేదు..'' అంటోంది సమంత.

అయినా ''హిందీలో నటిస్తేనే హీరోయిన్ గా గుర్తింపు వస్తుందా? దక్షిణాదిన చేతినిండా సినిమాలున్నాయి. నా సత్తా బయటపడిందిక్కడే. నాకంటూ ఓ అభిమాన వర్గం ఉంది. నా కోసం పాత్రలు సిద్ధం చేస్తున్న దర్శకులున్నారు. ఇవన్నీ వదులుకొని, మరో చోట అడుగుపెట్టి నా ఉనికిని చాటుకోవాలా? అంత అవసరం లేదనిపిస్తోంది. అందుకే బాలీవుడ్‌కి వెళ్లాలన్న ప్రయత్నాలేం చేయలేదు. చూద్దాం.. అలాంటి అవకాశం వస్తే, చేయాలనిపిస్తే.. అప్పుడు ఆలోచిస్తా'' అని చెప్పుకొచ్చింది.

సామాజిక సేవలు...

ఇప్పటికే ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవలు చేస్తున్న సమంత ఇప్పుడు ‘ఫుడ్ ఫర్ చేంజ్' అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ ( ప్రచారకర్తగా) వ్యవహరించనుంది. ఈ కొత్త ఆర్గనైజేషన్ ద్వారా పేదవారికి చదువు చెప్పించి వారి భవిష్యత్తుని తీర్చిదిద్దే అవకాశం వచ్చిందని ఆమె చాలా సంతోషంగా చెప్తోంది. సమంత చేస్తున్న ఈ సామాజిక కార్యక్రమాలు ను చూసి అందరూ ఆమెపై ప్రశంసల జల్లుల కురిపిస్తున్నారు.

Samantha loses out Charan to Rakul

ఇప్పటికే ఆమె ప్రాజెక్ట్‌ 511 పేరిట నడుస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ తో కలిసి పనిచేస్తోంది. ప్రాజెక్ట్‌ 511 హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలోని 511 ప్రభుత్వ స్కూళ్లను గుర్తించి వాటికి మౌలిక సదుపాయాలను తన వంతుసాయంగా అందజే స్తోంది. ఇటువంటి పాఠశాలల్లో ఎక్కువగా చదువు కునేది పేద విద్యార్థులే.

అలాగే... మలయాళంలో విడుదలైన 'బెంగళూర్‌ డేస్‌' చిత్రం తమిళ రీమేక్‌లో సిద్ధార్ధ్‌, సమంత నటిస్తున్నట్లు కోలీవుడ్‌, టాలీవుడ్ లో ప్రచారం జరిగింది. ఈ ఇద్దరి స్నేహం మధ్య చీలికలు ఏర్పడ్డాయని, అందువల్ల ఆ జంట ఇకపై కలిసి నటించబోదని వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ ప్రచారం జరగడంతో అది తమిళ చిత్ర పరిశ్రమలో ఆసక్తిని కలిగించింది. వారి ప్రేమ వ్యవహారం ముగిసిన తరువాత సింబు-నయనతార, సింబు-హన్సిక జంటగా నటించినట్లే సిద్ధార్థ్‌-సమంత కూడా కలిసి నటిస్తున్నారని అంతర్జాలంలో పుంఖానుపుంకాలుగా వ్యాసాలు వచ్చాయి.

వీటిని సిద్ధార్థ్‌, సమంత ఇద్దరూ తమ వెబ్‌సైట్లలో ఖండించారు. 'బెంగళూర్‌ డేస్‌'లో తాను నటించడం లేదని, 2015లో నటించనున్న చిత్రాల గురించి వివరాలను త్వరలో తెలియజేస్తానని, ప్రస్తుతం 'ఎనక్కుళ్‌ ఒరువన్‌' చిత్రం విడుదల కోసం వేచి చూస్తున్నానని తన సామాజిక వెబ్‌సైట్‌ పేజీలో సిద్ధార్థ్‌ తెలిపారు. అలాగే తను కూడా నటించడం లేదని సమంత తన సామాజిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

మలయాళంలో ఘనవిజయం సాదించిన ‘బెంగళూరు డేస్' సినిమాను తెలుగు, తమిళ భాషలలో పివిపి సంస్థ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించకపోయినా ఈ సినిమాలో సిద్దార్ధ్, సమంత నటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను సిద్దార్ధ్ ఖండించారు. సోషల్ మీడియాలో ఈ విషయం వెల్లడించారు. త్వరలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వెల్లడిస్తానని చెప్పారు. సిద్దార్ధ్, సమంతల లవ్ ఫెయిల్యూర్ దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది.

‘బొమ్మరిల్లు' భాస్కర్ ఈ రీమేక్ దర్శకత్వ భాద్యతలు చేపట్టారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉన్నాయని సమాచారం. మార్చ్ 1వ తేదీ నుండి హైదరాబాద్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తమిళంలో ఆర్య, నిత్యా మీనన్, బాబీ సింహా.. తెలుగులో కమెడియన్ నుండి హీరోగా ప్రమోట్ అయిన హీరో సునీల్ కీలక పాత్రల్లో నటిస్తారని ప్రచారం జరుగుతుంది.

English summary
Samantha Ruth Prabhu has once again faced the exit from Ram Charan’s movie. As she is said to be struggling to provide dates for upcoming Srinu Vytla’s movie, she is now replaced with happening beauty Rakul Preet Singh.
Please Wait while comments are loading...