»   » సెంటిమెంట్ గానే...సమంత కు ఎన్టీఆర్ నో ?

సెంటిమెంట్ గానే...సమంత కు ఎన్టీఆర్ నో ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమావాళ్లకు బోల్డు సెంటిమెంట్స్ ఉంటాయనే సంగతి తెలిసిందే. రెండువరస హిట్స్ పడితే గోల్డెన్ లెగ్ అని పొగిడేసి భుజాన పెట్టుకుని, వరస ఆఫర్స్ ఇచ్చేస్తారు. ఒక ఫ్లాఫ్ వస్తే మాత్రం రిస్క్ అంటూ వాళ్లతో పని చేయటానికి ఎవరూ ఆసక్తి చూపించరు. ఇప్పుడు అలాంటి పరిస్ధితే సమంత ఎదుర్కొంటోందా..

ఎన్టీఆర్, సమంత కాంబినేషన్ లో ఇప్పటికి మూడు సినిమాలు వచ్చాయి. మొదట వచ్చిన బృందావనం చిత్రం మంచి విజయం సాధించింది. అయితే తర్వాత వచ్చిన రభస, రామయ్యా వస్తావయ్యా మాత్రం చీదేసింది. అయితే ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ తెరకెక్కుతుందని అంతా భావించారు. కానీ పరిస్ధితులు మాత్రం అందుకు సహకరించేటట్లు కనపడటం లేదు.

Samantha not in NTR's Garage

కొరటాల శివ డైరక్షన్ లో ఎన్టీఆర్ చెయ్యబోతున్న సినిమా జనతా గ్యారేజ్. ఈ చిత్రంలో మొదట హీరోయిన్ గా సమంతని అనుకున్నారు, కాని ఇంతలో ఏమి జరిగిందో తెలీదుగాని ఈ సినిమా నుండి సమంతాను తప్పించినట్టు టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం. అందుకు కారణం,రభస, రామయ్యా వస్తావయ్యా సినిమాలు భారీ డిజాస్టర్స్ కావటమే అని కొందరంటున్నారు. ఏది ఏమైనా సీన్ లో సమంత మాత్రం లేదు.

కానీ ముందుగా అనుకుంటున్నట్టు నిత్యమీనన్ మాత్రం కంటిన్యూ చేయ్యలని టీం భావిస్తోంది. సంమంతా ప్లేస్ లో మరో హీరోయిన్ కోసం వేట కొనసాగిస్తున్నారని టాక్. ఫిబ్రవరిలో ఈ సినిమా మెదలై, సెట్స్ పైకి వెళ్ళనుంది. నాన్నకు ప్రేమతో సినిమా హిట్ అవ్వడంతో ఎన్టీఆర్ చాలా ఎనర్జిట్ గా ముందుకు కదులుతున్నాడు.

English summary
It's confirmed that Samantha would not be part of NTR's next.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu