»   » 'సావిత్రి' బయోపిక్..సమంత రిజెక్టు, కారణం వింటే షాక్ అవుతారు

'సావిత్రి' బయోపిక్..సమంత రిజెక్టు, కారణం వింటే షాక్ అవుతారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు చ‌ల‌న చిత్ర సీమ‌లో మ‌హాన‌టిగా వెలుగొందిన సావిత్రి జీవిత క‌థ ఆధారంగా ఒక మూవీ రానున్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రానికి నాగ అశ్విన్ ద‌ర్శ‌కుడు.. అయితే ఈ పాత్ర‌ను స‌మంత తో చేయించాల‌నే అనుకున్నారు. ఈ మేరకు వార్తలు కూడా వచ్చాయి.. ఆమె అయితేనే ఈ పాత్ర‌కు న్యాయం చేయ‌గ‌ల‌ద‌ని అంతా భావించారు.

ఇన్నాళ్లూ వ‌ర‌కూ చిలిపి పాత్ర‌ల‌కు, గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు ప‌రిమిత‌మైన స‌మంత మ‌రి సావిత్రి పాత్ర‌లో న‌టించి ఫెరఫార్మెన్స్ ఇస్తుందని అంతా భావించారు. అయితే చివరి నిముషాల్లో ట్విస్ట్ వచ్చింది. ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేసిందని సమాచారం. ఆఖరికి అశ్వనీదత్ తమ అల్లుడు కోసం సీన్ లోకివచ్చినా వర్కవుట్ కాలేదని అంటున్నారు. ఇంతకీ సమంత రిజెక్టు చేయటానికి కారణం ఏంటో తెలుసా...

Samantha rejects Savithri Biopic offer

ఈ బయోపిక్ కోసం ...మొదట మలయాళ భామ నిత్యామీనన్ ను ఈ పాత్ర కోసం అనుకున్నా.. తర్వాత చెన్నై బ్యూటీ సమంతతో సంప్రదింపులు జరిపారనే చెప్పుకున్నారు. అయితే.. సావిత్రిగా నటించేందుకు సమంత నో చెప్పేయడంతో.. ఇప్పుడు నిర్మాతలు షాక్ తిన్నారట.

అందుకు కారణం...మహానటి పాత్రలో నటించేందుకు కాసింత బొద్దుగా తయారు కావాలని దర్శకుడు పట్టుబట్టాడట. అప్పుడు సమంత...పెర్ఫామెన్స్ విషయంలో మీకెలా కావాలన్నా అడగండి కానీ.. పర్సనాలిటీ విషయంలో మాత్రం కండిషన్స్ పెట్టద్దని తేల్చి చెప్పిసిందిట సమంత. దీంతో చివరకు తప్పక మరోసారి నిత్యా మీనన్ నే సావిత్రి పాత్రకు ఫైనల్ చేసుకున్నట్లు వినపడుతోంది.

    English summary
    From past few days, the news about Samantha is going to portray the role of Savitri in her biopic. But the sources close to the film unit denied casting Samantha.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu