»   » విదేశాల్లో స్టేజ్ షో లు ప్లాన్ చేసుకుంటున్న సమంతా

విదేశాల్లో స్టేజ్ షో లు ప్లాన్ చేసుకుంటున్న సమంతా

Posted By:
Subscribe to Filmibeat Telugu

సమంతా స్టేజ్ షో లు చేయటం ఏమిటీ, అంత అవసరం ఏమొచ్చిందీ... సినిమాలు బాగానే చేస్తోంది కదా అనుకుంటున్నారా. సమంతా స్టేజ్ షోలు తన కోసం కాదు పేదపిల్లలకోసం అట. అందాల భామ సినీ నటి సమంత కొంత కాలంగా ఒక చారిటీ నడుపుతోందన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆమె మహిళలు మరి చిన్న పిల్లల కోసం "ప్రత్యూష" అనే ఒక చారిటబుల్ ట్రస్ట్ ని ప్రారంభించింది. తాజాగా ఈ ఆర్గనైజేషన్ కి ప్రభుత్వ గుర్తింపు లభించింది.

ఇప్పటికే సమంత ఈ ఆర్గనైజేషన్ కోసం ఫండ్స్ కలెక్ట్ చెయ్యడం కోసం పాపులర్ సినీ హీరోల కాస్ట్యూమ్స్ ని వేలం వేస్తోంది. తను ఇప్పటికే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో వేసుకున్న డ్రెస్, మహేష్ బాబు దూకుడులో వేసుకున్న డ్రెస్ లని సేకరించింది. ఈ చారిటీ ద్వారా ఎంతోమంది చిన్న పిల్లలని మరియు మహిళలను ఆదుకుంటున్నారు. అలాగే ప్రస్తుతం చారిటీని మరో లెవల్ కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తోంది.

samantha

ఈ సంవత్సరం మొత్తం సమంత నామ సంవత్సరమే అనుఇకోవాలి.ఈ సంవత్సరం లో ఇప్పటికే నాలుగు పెద్ద సినిమాలు చేసి,శభాష్ అనిపించుకుంది. అయితే ఇక ఇప్పటికిప్పుడు హీరోయిన్ గా సమంత చేతిలో ప్రస్తుతం జనతా గ్యారేజి తప్ప వేరే సినిమాలు అయితే లేవు. తమిళం, తెలుగు, కన్నడలో తలో సినిమా వున్నాయి. తెలుగులో ఇంకోసారి త్రివిక్రమ్ ఓకే అంటే పవన్ తో ప్లాన్ చేస్తున్న కొత్త సినిమాలో సెలక్ట్ అయిపోతుంది.

ఈ లోగా ఖాళీ దొరికితే తన సేవా కార్యక్రమాలను విస్తరించాలనుకుంటోందట సమంత. అందుకోసం నిధుల సమీకరణ కూడా చేయాలనుకుంటోందట. మరి నిధులు ఎలా సమీకరించాలి? అందుకోసమే విదేశాల్లో స్టేజ్ షోలు చేయాలనుకుంటోంది. అయితే ఈ స్టేజ్ షోలు ఎలా? సోలోగానా? కాన్సెప్ట్ ఏమిటి? ట్రూప్ ను సెట్ చేసుకుంటుందా? అవన్నీ ఇంకా డిస్కషన్ లోనే వున్నాయట.

    English summary
    Samantha Ruth Prabhu plans to Stage Shows in Dubai and america for her NGO Pratyusha Organisation
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu