»   » పాపం అనుపమ పరమేశ్వరన్ .. ఛాన్స్ కొట్టేసిన సమంత

పాపం అనుపమ పరమేశ్వరన్ .. ఛాన్స్ కొట్టేసిన సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్వరలో అక్కినేని ఇంటి కోడలుగా మారబోతున్న సమంత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో జతకడుతున్నట్టు ఫిలింనగర్ సమాచారం. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం పిరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్నట్టు తెలుస్తున్నది. 90వ దశకం నాటి గ్రామీణ నేపథ్యం ఉన్న కథతో తెరకెక్కే ఈ చిత్రం కోసం తొలుత సమంత, రాశీఖన్నా, అనుపమ పేర్లను పరిశీలించారు. ఆ తర్వాత మలయాళ తార అనుపమ పరమేశ్వరన్ ను కన్ ఫర్మ్ చేసినట్టు వార్తలు హల్ చల్ చేశాయి.

Samantha with Ram Charan in Sukumar direction

ఆ వార్తకు బలం చేకూరుస్తూ రామ్ చరణ్ సరసన నటిస్తున్నట్టు అనుపమ ధ్రువీకరించింది. ఆ తర్వాత అనుపమ ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తుండటంతో ఆమెను పక్కన పెట్టినట్టు తెలిసింది. చివరికి మొదట పరిగణనలోకి తీసుకొన్న సమంతను ఖరారు చేసినట్టు సమాచారం. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌పై ఈ చిత్ర షూటింగ్‌ జనవరి 30న లాంఛనంగా ప్రారంభం కానున్నట్టు తెలుస్తున్నది.

English summary
Anupama Parameshwaran Misses chance with Ramcharan in a movie which directing the Sukumar
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu