»   » డిప్రెషన్ తో డైరెక్టర్ ని టార్చర్ పెడుతున్న రామ్ చరణ్..!?

డిప్రెషన్ తో డైరెక్టర్ ని టార్చర్ పెడుతున్న రామ్ చరణ్..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మగధీర"తో టాప్ రేంజ్ కి వెళ్లిపోయిన రామ్ చరణ్ 'ఆరెంజ్" ప్లాప్ అవ్వడం, 'మెరుపు" స్టార్ట్ అయి ఆగిపోవడం వీటివల్ల ఎంతో డిప్పెషన్ కి లోనయ్యాడు. తర్వాత చెయ్యబోయే సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందోనని ఇప్పటి నుంచే కంగారు పడడం మొదలెట్టాడు. సంపత్ నంది డైరెక్షన్ లో సినిమా వుందని కొన్నాళ్లు, లేదని కొన్నాళ్ళు సస్పెన్స్ మెయిన్ టెయిన్ అయింది. చివరికి సంపత్ నందితో 'రచ్చ" స్టార్ట్ అయింది. మరో పక్క వినాయక్ తో కన్ ఫర్మ్ గా సినిమా వుంటుందనుకున్న చరణ్ కి తనతో సినిమా చేసేందుకు వినాయక్ సిద్దగా లేడని తెలిసి మరింత డిప్రెషన్ లోకి వెళ్లాడు.

వీటన్నిటి ప్రభావం ఇప్పుడు చేస్తున్న 'రచ్చ"మీద పడుతోంది. డైరెక్టర్ సంపత్ నందిని చరణ్ రకరకాలుగా టార్చర్ పెడుతున్నాడని చెప్పుకుంటున్నారు. ఎంతో మంది తనతో సినిమాలు చెయ్యడానికి రెడీగా వున్నప్పటికీ కేవలం కథ నచ్చడంవల్లే సినిమా చేస్తున్నానని సంపత్ తో పదే పదే చెప్తున్నాడట. అంతే కాకుండా స్ర్కిప్ట్ లో ఇన్ వాల్వ్ అయి ప్రతి సీన్ గురించి డిస్కస్ చేస్తున్నాడట. 'ఆరెంజ్" దెబ్బకి ఏం చేయాలో తోచని స్థితిలో వుండడం వల్లే ఇలా ప్రవర్తిస్తున్నాడని యూనిట్ చెప్పుకుంటున్నారు..

English summary
Is Ram Charan feeling insecure? After the movie 'Orange' has not met the expectations set on him by the spectators it might be possible that he is feeling low, this is said mainly because of his behavior these days on the sets of 'Rachcha'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu