»   » లాజిక్ మిస్సయిన సంపత్ నంది?: గోపీచంద్‌ను అలా చూడలేకపోతున్నారట..

లాజిక్ మిస్సయిన సంపత్ నంది?: గోపీచంద్‌ను అలా చూడలేకపోతున్నారట..

Subscribe to Filmibeat Telugu

ఆల్రెడీ ఫుల్ కటౌట్ చూసినోడు.. పాస్ పోర్ట్ సైజ్ ఫ్రేమ్‌తో కనెక్ట్ అవడం కష్టమే. పవర్ ఫుల్ విలన్‌గా తానేంటో గతంలోనే నిరూపించుకున్న గోపీచంద్.. ఏమాత్రం పసలేని విలనిజంలో తలదూర్చడం.. అబ్బే! ఎక్కడో తేడా కొడుతుందే.. అన్న అభిప్రాయం కలిగేలా చేస్తుంది.

సంపత్ నంది దర్శకత్వంలో తాజాగా విడుదలైన గోపీచంద్ 'గౌతమనంద' సినిమాపై ప్రేక్షకులు ఇప్పుడిలాగే ఫీల్ అవుతున్నారు. సినిమాలో గోపీచంద్ నెగటివ్ రోల్ చేయకుండా ఉండాల్సిందేమో! అన్న అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

sampath nandi missed the logic regarding gopichand negative role

నిజానికి ఈమధ్య కాలంలో.. విజయ్, సూర్య, తెలుగులో ఎన్టీఆర్ వంటి హీరోలు నెగటివ్ రోల్స్ తో సిద్దమైపోయారు. జై లవకుశలో ఎన్టీఆర్ ప్రతినాయకుడి పాత్రలోను కనిపించనున్నారు. అయితే ఈ హీరోలంతా గతంలో విలన్ రోల్స్ చేసినవారు కాదు కాబట్టి.. స్క్రీన్ మీద ఆ పాత్రల్లో వీరిని చూడటం కాస్త కొత్తగానే ఉంటుంది.

కానీ గోపీచంద్ విషయం వేరు. వర్షం, జయం వంటి సినిమాల్లో తన విలనిజానికి ప్రేక్షకుల చేత 100శాతం మార్కులు వేయించుకున్నాడు. అలాంటి వ్యక్తి.. ఏదో సాదాసీదా విలనీ పాత్రలో కనిపిస్తే.. ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం కష్టమే. ఇప్పుడు గౌతమ్ నంద విషయంలోను అదే జరిగిందంటున్నారు సినీ విశ్లేషకులు.

గోపీని పవర్ ఫుల్ విలన్‌గా చూసిన అభిమానులు.. చిన్నసైజు విలన్ పాత్రలో ఆయన్ను ఊహించలేకపోతున్నారు. సంపత్ నంది ఈ లాజిక్ ఎలా మిసయ్యారో అర్థంకావట్లేదంటున్నారు. సరే, ఈ సంగతంతా ఎలా ఉన్నా.. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది కాబట్టి.. బాక్స్ ఆఫీస్ ముందు గౌతమ్‌నంద సత్తా ఏంటో తేలాలంటే ఇంకో రెండు మూడు రోజులు వేచి చూడాల్సిందే.

Goutham Nanda Movie Public Talk And Review
English summary
Director Sampath Nandi missed the logic regarding Hero Gopichand Negative role in Gautamnanda movie.
Please Wait while comments are loading...