»   » పవన్ ఆలస్యం: జూ ఎన్టీఆర్ వైపు సంపత్ నంది?

పవన్ ఆలస్యం: జూ ఎన్టీఆర్ వైపు సంపత్ నంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళంలో మోహన్ లాల్, విజయ్ కలిసి నటించిన 'జిల్లా' చిత్రం అక్కడ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈచిత్రం తెలుగులో రీమేక్ కాబోతోందంటూ వార్తలు వినిపించాయి. రామ్ చరణ్, చిరంజీవి పేర్లతో పాటు చాలా మంది హీరోల పేర్లు సైతం వినిపించాయి. తాజాగా జూ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.

దర్శకుడు సంపత్ నంది జూ ఎన్టీఆర్‌తో ఈ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంపత్ నంది మొదలు పెట్టిన 'గబ్బర్ సింగ్-2' చిత్రం ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి కనిపించక పోవడంతో ఈ కొత్త ప్రాజెక్టు గురించి ఆలోచిస్తున్నాడట. అయితే ఇంకా ఇది ప్రతిపాదనల దశలోనే ఉందని అంటున్నారు.

Sampath Nandi to Remake Jilla with Ntr!

ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. తమిళంలో విజయ్ పోషించిన పాత్ర జూ ఎన్టీఆర్ చేయబోతున్నాడని, మోహన్ లాల్ పాత్రకు మరో సీనియర్ స్టార్‌ను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం జూ ఎన్టీఆర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రభస' చిత్రంలో నటిస్తున్న సంగత తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. దీని తర్వాత పూరి జగన్నాథ్ దర్వకత్వంలో మరో సినిమాకు ఎన్టీఆర్ కమిటైనట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

English summary
Noted Director Sampath Nandi of Rachcha fame is going to team-up with Young Tiger Jr.NTR in the forthcoming untitled movie which is going on floors shortly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu