»   » సంపూర్ణేష్‌ బాబుకు అవమానం, ఇన్సల్ట్ చేసారా? అంత సీనుందా

సంపూర్ణేష్‌ బాబుకు అవమానం, ఇన్సల్ట్ చేసారా? అంత సీనుందా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సంపూర్ణేష్ బాబుకు అవమానం జరిగిందంటూ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం అమెరికాలో ఉన్న నాటా సంస్ద అని చెప్తున్నారు. నాటా సంస్ద కు, సంపూకి లింకేంటి...వాళ్లు పనిగట్టుకుని అవమానం చెయ్యటమేంటి..ఇది కావాలని క్రియేట్ చేసిన రూమరా, లేక నిజంగానే జరిగిందా..అంటే మీరు పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.

అందుతున్న సమాచారం ప్రకారం సంపూర్ణేష్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని అమెరికాలోని నాటా సంస్థ (ఉత్తర అమెరికా తెలుగు సమితి) ఆయనను నాటా ఉత్సవాలకు ఆహ్వానించింది. ఈనెల 27(అంటే ఈ రోజు) నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుక కోసం పలువురు స్టార్ హీరోలతో పాటు సంపూర్ణేష్‍ను సైతం ఆహ్వానించారు.

అయితే ఈ వేడుకలకు సంబంధించి నాటా ప్రచురించిన ఇన్విటేషన్ కార్డుల్లో ఆయన ఫోటోను కమెడియన్లతో కలిపి వేశారట. దీంతో హీరోనైన తనను కమెడియన్‍గా ట్రీట్ చేయడం నచ్చలేదని, ఈ వేడుకకు హాజరు కానని సంపూర్ణేష్ స్పష్టం చేసేశారనేదే ఈ వార్త.

sampoornesh babu insulted by nata

ఈ విషయం తెలుగుకున్న నాటా వారు వెంటనే స్వయంగా రంగంలోకి దిగి .. సంస్థ తరపున పలువురు ఆయనను ఎలాగో ఒప్పించి మళ్ళీ కొత్త ఇన్విటేషన్ కార్డులు ప్రచురించినా, చివరకు తన మేనేజర్‌కు వీసా రాలేదన్న కారణంతో సంపూర్ణేష్ ఈ వేడుకకు హాజరు కావడం లేదని చెప్తున్నారు. అదండీ మ్యాటర్.

ఇక 'హృదయ కాలేయం', 'సింగం 123' సినిమాలతో బర్నింగ్ స్టార్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంపూర్ణేష్ బాబు, తాజాగా కొబ్బరి మట్ట అంటూ మరో పేరడీ సినిమాతో రాబోతున్నాడు.

అమృత ప్రొడక్షన్స్‌, గుడ్‌ సినిమా గ్రూప్‌, సంజనా మూవీస్‌ తెరకెక్కిస్తున్న సినిమా 'కొబ్బరిమట్ట'. సంపూర్ణేష్‌ బాబు హీరో. షకీలా, గాయత్రి, గీతాంజలి, ఇషిక, భార్గవి, మహేష్‌ కత్తి, గురుచరణ్‌, అజరు, సురేష్‌ కానగంటి, రాజ్‌, భరత్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఆది కుంభగిరి, సాయి రాజేష్‌ శీలం నిర్మించారు. రూపక్‌ రొనాల్డ్‌ సన్‌ దర్శకత్వం వహించారు.

sampoornesh babu insulted by nata

హృదయ కాలేయం దర్శకుడు స్టీవెన్ శంకర్ అందించిన కథతో దర్శకుడు రూపక్ రోనాల్డ్‌సన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా ఎలా ఉండనుందో పరిచయం చేస్తూ రీసెంట్ గా విడుదల చేసిన టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఆడవాళ్ళ గొప్పతనం కొంచెం వ్యంగ్యం కలగలపి తెలియజేస్తూ, పెదరాయుడు గెటప్‌లో సంపూర్నేష్ చెప్పే నిమిషం పైనే ఉండే లెంగ్తీ డైలాగ్‍కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

విడుదలైన కొద్దిగంటల్లోనే ఈ ట్రైలర్ 2 లక్షల వ్యూస్ సంపాదించుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడు అన్న మూడు పాత్రలతో ఈ సినిమా సంపూర్ణేష్ బాబు మనకు ఈ సినిమాలో కనిపించనున్నారు.

English summary
NATA has listed Sampoornesh Babu as a comedian instead of a hero and Sampoornesh was unhappy with his title, since he believed he should have been listed as a hero.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X