Sandeep Reddy Vanga: ప్రభాస్ తర్వాత మహేశ్‌తో.. సందీప్ రెడ్డి మాస్టర్ ప్లాన్..
Sandeep Vanga With Mahesh Babu: 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లో కూడా అత్యంత హాట్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారు. తన ప్రత్యేక నేరేషన్, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే శైలి, హీరోలలోని మాస్ అటిట్యూడ్-ఇంటెన్సిటీని బయటకు తీసే విధానం ఆయన సినిమాల హైలైట్. ప్రస్తుతం సందీప్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ 'స్పిరిట్' తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. సందీప్ రెడ్డి కన్ను సూపర్ స్టార్ మహేష్ బాబుపై పడిందట. ఆ కథేంటో ఓ లూక్కేయండి.
ప్రస్తుతం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. డార్లింగ్ ప్రభాస్ సినిమాతో బిజీబిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ గా కనిపించనున్నారట. ఇటీవల విడుదలైన 'స్పిరిట్' ఆడియో గ్లింప్స్ ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ప్రభాస్ మాస్ లుక్, సందీప్ మార్క్ ఎమోషనల్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఈ నెలలో షూటింగ్ ప్రారంభమయ్యే ఈ సినిమా మూడు నుంచి నాలుగు నెలల్లో కంప్లీట్ చేయాలని సందీప్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. టీమ్ 2026లో గ్రాండ్ రిలీజ్‌కి సన్నాహాలు చేస్తోంది.

ఇదిలా ఉండగా, 'స్పిరిట్' తర్వాత సందీప్ రెడ్డి వంగా సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నాడనే వార్త ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రాథమిక స్క్రిప్ట్ వర్క్ మొదలైందట. ప్రస్తుతం మహేశ్ బాబు రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న 'ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వడానికి ఏడాదికిపైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఆలోగా 'స్పిరిట్'ను పూర్తి చేసి, మహేశ్ బాబు కోసం ప్రత్యేకమైన కథతో రావాలని సందీప్ ఆలోచిస్తున్నాడట.
ఇది మొదటిసారి కాదు. 'అర్జున్ రెడ్డి' సక్సెస్ తర్వాత సందీప్ రెడ్డి వంగా, మహేశ్ బాబు కాంబినేషన్‌లో సినిమా గురించి అప్పట్లో చర్చలు జరిగాయి. అయితే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు మాత్రం ఆ కాంబినేషన్ నిజం అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మహేశ్ బాబుకు సందీప్ వర్కింగ్ స్టైల్ అంటే బాగా ఇష్టం. 'యానిమల్' రిలీజ్ సమయంలో మహేశ్ బాబు వ్యక్తిగతంగా సందీప్‌ని అభినందించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇద్దరి మధ్య మంచి ప్రొఫెషనల్ బాండ్ కూడా ఉంది.
ఇక మరో వైపు, అల్లు అర్జున్‌తో 23వ సినిమా సందీప్ రెడ్డి వంగా చేయబోతున్నాడనే ప్రకటన వచ్చినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందనే అనుమానాలు ఉన్నాయి. 'ఐకాన్', 'పుష్ప 3' వంటి ప్రాజెక్ట్‌లు ఉన్న నేపథ్యంలో ఆ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమేనని చెప్పాలి. అందుకే ఇప్పుడు మహేశ్ బాబు ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉందని సినీ వర్గాల అభిప్రాయం.
సందీప్ రెడ్డి వంగా తన కెరీర్‌లో చేసిన ప్రతి సినిమా భావోద్వేగాలను, మానవ సంబంధాలను అద్భుతంగా చూపిస్తూ, కంటెంట్ డ్రైవన్ మాస్ సినిమాలకు కొత్త నిర్వచనం ఇచ్చాడు. ఆయన దృష్టిలో హీరో అంటే కేవలం స్టార్ కాదు.. లోపల ఉన్న ఆవేశం, బాధ, ప్రేమ అన్నీ ఒక్క ఫ్రేమ్‌లో చూపించగల వ్యక్తి. ఈ స్టైల్‌లో మహేశ్ బాబు కనిపిస్తే అది ఓ మైలురాయి అవుతుందనడంలో సందేహం లేదు. అన్నీ అనుకున్నట్టే జరిగితే మహేశ్ బాబు-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ అధికారికంగా త్వరలో ప్రకటించబడే అవకాశం ఉంది. 'స్పిరిట్' విడుదలయ్యాకే ఆ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో ఈ వార్తే చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











