»   »  సంజనా! సరదాకైనా అలా చేయద్దు...

సంజనా! సరదాకైనా అలా చేయద్దు...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sanjana
బుజ్జిగాడు లో సెకెండ్ హీరోయిన్ గా హొయిలు ఒలికించిన సంజన ఇప్పుడు సింపుల్ సిటీతో వార్తల్లో నిలిచింది. అంతగా అందరూ చెప్పుకునేంత గొప్ప పనేం చేసింది అంటే ఆటోలో ఈ మధ్య ఓ షూటింగ్ స్పాట్ కి వచ్చేసింది. ఎందుకిలా చేసావు అని శ్రేయాభిలాషులుగా తయారయినవాళ్ళు కంగారుపడి ఆమె చెమట తుడవబోయారుట. దానికామె నేనేమీ నడిచి రాలేదు...ఆటో లో వచ్చాను. అదీ వాహనమేగా...అయినా కాబ్ వచ్చేదాకా వెయిట్ చేస్తే నిర్మాతకి ఎంత లాసు. డైరక్టర్ కి ఎంత టైమ్ వేస్టు..అని క్లాసు పీకిందిట. అప్పుడు అక్కడే ఉన్న హీరో (పేరెందుకులెండి)...చిరాకుపడి

"సంజనా సరదాకైనా అలా చేయద్దు...ఎలాటి స్ధితిలో అయినా ప్రొడక్షన్ కారులోనే రావాలి..అయినా ఓ ఎస్.ఎమ్.ఎస్ ఇస్తే నా కారు పంపుదును కదా" అని ఆవేశపడ్డాడుట. దానికామె కంగారుపడి చుట్టు ఉన్న యూనిట్ వంక చూస్తుంటే ఆయన నాలుక కరుచుకుని అదికాదు..."మనం స్టార్స్ మి కదా ...అలా అందరిలో తిరగటం ప్రమాదం. నువ్వు బెంగుళూరు నుండి మీవాళ్ళనందరినీ వదిలి ఇక్కడ షూటింగ్ కి వచ్చావు. మీ భాధ్యత నాది...సారి మాది కాదా అన్నాడట. దానికామె సంబరపడిందో లేదో గానీ ఎప్పుడూ చిన్న మెత్తు ఔదార్యం కూడా చూపని ఆ హీరో ప్రవర్తనకి అక్కడున్న వాళ్ళు తిట్టుకుంటూ నవ్వుకున్నారుట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X