»   » ప్రతిరోజూ జైలు నుంచి సంజయ్ దత్ ఉత్తరం

ప్రతిరోజూ జైలు నుంచి సంజయ్ దత్ ఉత్తరం

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబై : 1993 బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ పూణెలోని ఎరవాడ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సంజయ్ దత్ గురించి ఓ హాట్ టాపిక్ వినిపిస్తోంది. సంజయ్ దత్ ప్రతి రోజూ తన భార్య మాన్యతకు ఉత్తరం రాస్తున్నాడట. మాన్యత కూడా భర్తకు రోజూ క్రమం తప్పకుండా ఉత్తరం రాస్తోందట.

ముంబై పాలిహిల్ లోని నర్గీస్ రోడ్‌ ఇంపీరియల్ హైట్స్ అపార్టుమెంట్ 11వ అంతస్తులో సంజయ్ నివాసం. ప్రస్తుతం ఆ ఇంట్లో ఆయన భార్య, పిల్లలు ఉంటున్నారు. సంజయ్ నివాసానికి ప్రతి రోజూ పోస్టుమెన్ చక్కర్లు కొడుతుండటంతో అనుమానం వచ్చిన మీడియా వారు ఆరా తీగా ఈ విషయం బయట పడింది.

మాన్యతకు సంజయ్ దత్‌తో 2002లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. ఎంతో అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. సంజయ్ జైలు పాలవ్వడంతో ఆయన కుటుంబం ఒంటరి తనం అనుభవిస్తోంది. ఆలోటును పూడ్చేందుకు రోజూ భార్యకు ఉత్తరాలు రాస్తున్నాడట సంజయ్ దత్.

ఉత్తరాలు రాయడంతో పాటు సంజయ్‌ని నెలలో ఎన్నిసార్లు కలిసే అవకాశం ఉంటే అన్ని సార్లు వెళ్లి కలిసి వస్తోందట మాన్యత. 42 నెలల పాటు సంజయ్ దత్ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. మరి ఇంత కాలం సంజూభాయ్ కుటుంబానికి దూరంగా ఎలా గడుపుతాడో ఏంటో..!

English summary

 The postman is apparently knocking the gates of Sanjay Dutt’s residence very frequently now as the imprisoned actor and his wife Manyata are writing letters to each other every day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu