Just In
Don't Miss!
- Sports
ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన అజహరుద్దీన్ కలల లిస్టు ఇదే.. ఐపీఎల్, 4 సెంచరీలు సహా!!
- News
చర్చలు 120 శాతం ఫెయిల్.. 'ఉపా' చట్టాన్ని ప్రయోగిస్తారా? బ్రోకర్లతో చర్చలకు వెళ్లం.. రైతుల సంఘాల ఫైర్...
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఈవెంట్ హోస్ట్ ఎవరో తెలుసా? మెగా,సూపర్ స్టార్ అభిమానులకు స్పెషల్ కిక్
సూపర్ స్టార్ అభిమానులకు కిక్కిచ్చే వార్త తెలిసింది. సాధారణంగా ఎంత పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా దానికి హోస్ట్‌గా ఫేమస్ యాంకర్లను తీసుకోవడం చూసాం. కానీ 'సరిలేరు నీకెవ్వరు' విషయంలో అలా కాకుండా ఓ స్పెషల్ హోస్ట్ ఉండనున్నారట. ఆయన హోస్టింగ్ ప్రేక్షక లోకాన్ని మెస్మరైజ్ చేయనుందట. ఇంతకీ ఆ హోస్ట్ ఎవరు? వివరాల్లోకి పోతే..

జనవరి 5.. హైదరాబాద్ నడిబొడ్డున
జనవరి 5వ తేదీ ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎల్.బి స్టేడియంలో 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ వేడుక జరగనుందని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఈ వేడుకకు అశేష అభిమాన వర్గం హాజరు కానుంది. అయితే తన అభిమానుల్లో జోష్ నింపేలా ఈ వేడుక కోసం మహేష్ బాబు ఓ డిసీజన్ తీసుకున్నారట.

ప్రీ రిలీజ్ ఈవెంట్ హోస్ట్.. విడుదలకు ముందే
'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఈవెంట్ హోస్ట్‌గా స్వయంగా మహేష్ బాబే వ్యవహరించబోతున్నారట. ఈ మేరకు ఎంతో ఎక్సయిటింగ్ గా ఉన్న ఆయన అందుకు ప్రిపేర్ కూడా అవుతున్నట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే హోస్ట్‌గా 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకోవాలని డిసైడ్ అయ్యారట మహేష్.

మెగా, సూపర్ స్టార్ అభిమానుల కోసమే..
ఇక 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేయనున్న సంగతి తెలిసిందే. అంటే హైదరాబాద్ ఎల్.బి స్టేడియం ఇటు మెగా అభిమానులు, అటు సూపర్ స్టార్ అభిమానులతో కిటకిటలాడనుందన్నమాట. ఈ నేపథ్యంలో మెగా, సూపర్ స్టార్ అభిమానుల కోసమే ఇలా మహేష్ హోస్ట్ అవతారం ఎత్తుతున్నారని టాక్.

రష్మిక మందన్నతో సూపర్ స్టార్ రొమాన్స్
'సరిలేరు నీకెవ్వరు' సినిమా విషాయానికొస్తే.. ఇందులో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటించింది. ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి కనిపించనుంది. రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంగీత, బండ్ల గణేష్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

సంక్రాంతి కానుక.. మహేష్ బాబు డబ్బింగ్
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రూపొందింది. ఇటీవలే మహేష్ బాబు డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది.